మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు కౌన్సెలింగ్
జగిత్యాల నవంబర్ 21
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు పైకి వస్తుందని జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై అనిల్ తెలిపారు. గత రెండు రోజులుగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడ్డ 48 మంది వాహనదారులకు బుధవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోని కౌన్సిలింగ్ సెంటర్ లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ట్రాఫిక్ ఎస్సై అనిల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరుగే ప్రమాదాల గురించి ఆడియో, వీడియో ద్వారా అవగాహన కల్పించారు.ఆనంతరం ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు పైకి వస్తుందని, యజమాని లేని కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని అన్నారు.వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, అతి వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా మద్యం సేవించిన వారితో ఈరోజు నుండి మద్యం సేవించి వాహనాలు నడపమని మరియు వాహనము నడుపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా దరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కౌన్సెలింగ్ వచ్చిన వారిని విడతలవారీగా కోర్టుకు పంపించడం జరుగుతుందని తెలిపారు.