గంగపుత్రుల ను ఎస్టీ జాబితాలో చేర్చాలి
మందమర్రి నవంబర్ 21
దేశంలో ని 13 రాష్ట్రాలు గంగపుత్రులను ఎస్టీలుగా, ఎస్సీలుగా గుర్తించారని తెలంగాణ రాష్ట్రంలోని గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మందమర్రి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు కట్ల మోహన్, ప్రధాన కార్యదర్శి జక్కన బోయిన శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గంగపుత్రుల ఐకమత్యమే బలం, ధైర్యమే జీవన విధానానికి ఆయుధం అని బెస్త సోదరులు చైతన్య మై ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. గంగ పుత్రులు గంగమ్మ తల్లి బిడ్డలుగా పుట్టుకతోనే నీటిలోని వనరులపై హక్కుదారులు గా చేపల వేట జీవనంగా వస్తుందని వారు తెలిపారు. గంగపుత్రుల ను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు పేద మత్స్యకారులకు రెండు పడకల ఇండ్లను మంజూరు చేయాలని అలాగే జీవో నంబర్ 6 ను రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు బెదుల రాయమల్లు, బంగారి రామచందర్, మాదర బోయిన లచ్చయ్య, పెంటయ్య, మధు నయ్య, నారాయణ, రవి రాజు, విజ్జి గిరి తదితరులు పాల్గొన్నారు