సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి
అసిఫాబాద్ నవంబర్ 21
జిల్లా లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా మార్కెట్ యార్డ్ లోపత్తి కొనుగోల్లు చేపట్టాలి.. సీపీఎంజిల్లా కమిటీ డిమాండ్..సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యములో కాగజ్ నగర్ పట్టణంలోని కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ర్ట కమిటీ సభ్యులు బి. రవికుమార్ మాట్లాడుతూ కుమురం భీం జిల్లాలో మార్కెట్ యార్డ్ లలో పత్తి కొనుగోలు చెయ్యడం లేదాని, దాలరులే కె రైతుల భవిష్యత్ ను మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలు తాకట్టు పెట్టాయి. ప్రభుత్వాలు ప్రకటించిన గిట్టబాటు ధరలను తామే అమలు చెయ్యకుండా తమ మాటలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి అన్నారు. జిల్లాలో 3 లక్షల 37 వేల 500 ఎకరాలలో పత్తి సాగు అవుతుంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మార్కెట్ యార్డ్ లలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యములో సీసీఐ కొనుగులు కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కానీ అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఎవరు కూడా తమ కు బాధ్యత లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇదే అవకాశం అన్నట్టు గా భావించిన దళారులు కేవలం మూడు వేల నుండి నాలుగు వేల రూపాయల మధ్య లో మాత్రమే కొనుగోలు చేస్తూ రైతుల ను నిలువు దోపిడి చేస్తున్నారు. దీనికి తోడు రాష్ర్ట ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అంచనా కట్టేదాంట్లో 33 శాతం కి మించి నష్టం ఉన్నదాన్నే పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు నిబంధనలు పంపింది. ఇందువల్ల పంట నష్టం కూడా ఏమి జరగలేదని నివేదికలు తాయారు అయ్యాయి. దీనితో జిల్లాలో పడ్డ వర్షాల ఫలితంగా నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందకుండా పోయింది. దీనికి తోడు పత్తి కొనుగోలు చేస్తున్న జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తూ తక్కువ రేటు కి కొనుగోలు చేస్తున్నారు. దీనితో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.12 శాతం పైగా తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వం బేషరతుగా పత్తి కొనాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికంగా పడిన వర్షాలు, చలి తీవ్రత నేపథ్యంలో తేమ శాతం కు మినహింపు ఇవ్వాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో సీపీఎంజిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్, పట్టణ కార్యదర్శి ముంజం. ఆనంద్ కుమార్ పాల్గొన్నారు..