కొందరు అధికార కాంక్షతోనే పార్టీలు మారుతున్నారు: మాజీ మంత్రి నక్కా
గుంటూరు నవంబర్ 21
;రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కొందరు అధికార కాంక్షతోనే పార్టీలు మారుతున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజమైన కార్యకర్తకు పదవులు ముఖ్యం కాదన్నారు. అన్ని వ్యవస్థలను చెప్పుచేతల్లో ఉంచుకోవాలని..అధికార పార్టీ చూస్తోందని విమర్శించారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చూస్తున్నారని, జగన్‌కు పాలన, ప్రజాసమస్యలపై అవగాహనలేదని నక్కా ఆనందబాబు ఆరోపించారు