నీరా పానీయం పై ప్రజల్లో అవగాహన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ నవంబర్ 21
తెలంగాణలోని అన్నిజిల్లాల్లో ఆరోగ్యపానీయమైన నీరాపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. యూత్‌లీడర్స్ ఫౌండేషన్, ఉస్మానియా విద్యార్ధులతో ఈ కార్యక్రమాన్నిచేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి గురువారం మంత్రి చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీరా పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. అన్నిఔషధ గుణాలు గల ప్రకృతి సహజంగా లభించే నీరానుర ప్రజలకు అందజేయనున్నామని తెలిపారు. నీరాను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూత్ లీడర్‌్‌స ఫౌండేషన్ నాయకులు కిరణ్, సురేష్‌నాయక్, రామకృష్ణ, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.