YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రజలు ఇచ్చిన తీర్పున గౌరవించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

ప్రజలు ఇచ్చిన తీర్పున గౌరవించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

 ప్రజలు ఇచ్చిన తీర్పున గౌరవించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.   

సమస్త హిందూ అఘాడి అధ్యక్షుడు మిలింద్ ఏక్టోబే

ముంబై 

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పున గౌరవించి బీజీపే-శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సమస్త హిందూ అఘాడి అధ్యక్షుడు మిలింద్ ఏక్టోబే సూచించారు. అలా కాకుండా బీజేపీ, శివసేన పార్టీలు వేరు వేరుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ-శివసేనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. హిందూ మహాసభ, హిందూ జాగృతి సమితి, హిందూ రాష్ట్ర సేన తదితర హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.బీజేపీ-శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరన్న ఆయన.. వేరు వేరు సిద్ధాంతాలు గల పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నిరసనలు తప్పవన్నారు. వివాదాలు పక్కన పెట్టి బీజేపీ-శివసేన పార్టీలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాగా.. మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజులు కావొస్తున్నా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎన్నికల్లో 105 స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. 56 స్థానాల్లో శివసేన అభ్యర్థులు గెలుపొందారు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం 145. బీజేపీ-శివసేన పార్టీలకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఉంది.ఒప్పందం ప్రకారం సీఎం పదవిని చెరో రెండు సంవత్సరాలు పంచుకుందామని శివసేన పట్టుపట్టింది. అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదంటూ బీజేపీ వాదిస్తోంది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రయత్నాలు మొదలు పెట్టింది. మూడు పార్టీల నాయకుల మధ్య చర్చలు నడుస్తుండగానే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. దీంతో ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన హిందుత్వ సంఘాలు బీజేపీ, శివసేన పార్టీలను హెచ్చరించాయి.

Related Posts