శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణస్వీకారం
కొలంబో
శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి పరాభవం ఎదురైన నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేశారు. విక్రమసింఘే అధికారికంగా పదవి నుంచి వైదొలిగిన అనంతరం, ప్రతిపక్ష నేత మహింద రాజపక్స ప్రధానిగా ప్రమాణం చేశారు. దేశంలో సాధారణ ఎన్నికలు జరిగే వరకు మహింద ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా తన సోదరుడు మహింద రాజపక్స పేరును ఆ దేశ నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఖరారు చేశారు. మరోవైపు, తాజా ఎన్నికల్లో అధికార యూఎన్‌పీ ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విక్రమసింఘెపై ఒత్తిడి పెరుగుతున్నది.