YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హరిత హారంలో సింగరేణి సంస్థ ఆదర్శంగా నిలవాలి

హరిత హారంలో సింగరేణి సంస్థ ఆదర్శంగా నిలవాలి

హరిత హారంలో సింగరేణి సంస్థ ఆదర్శంగా నిలవాలి
మందమర్రి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో సింగరేణి సంస్థ ఆదర్శంగా నిలవాలని సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ బాల రాం, డైరెక్టర్ ఇ ఆండ్ యం శంకర్, మందమర్రి ఏరియా జిఎం రమేష్ రావు లు అన్నారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా కేకే ఓసిలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గురువారం 1100 వందల మొక్కలు నాటారు. ఇందులో భాగంగా బాలరాం డైరెక్టర్ ఫైనాన్స్ పరిధిలో 360 మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం పాఠశాల లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన విద్యార్థులతో మాట్లాడారు. రాబోయే పదవ తరగతి లో విద్యార్థిని విద్యార్థులు కష్టపడి ర్యాంకును సాధించాలనివిద్యార్థిని విద్యార్థులకు సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే సింగరేణి పాఠశాల మైదానంలో కంపెనీ లెవెల్ పోటీలను సందర్శించి ఏరియా సీఎం రమేష్ రావుతో కలిసి పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, త్రో బాల్ పోటీలలో విజేతలకు నిలిచి ఇండియా పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు ఆయన మెడల్స్ ను, బహుమతులు అందజేసి ఇ మాట్లాడుతూ లో జరిగే పోటీల్లో విజయం సాధించి సింగరేణి సంస్థ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.  జిఎం కార్యాలయం లో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను పిఅండ్ పి భాస్కర్ రావు డైరెక్టర్ ఫైనాన్స్ బాల రామ్ సీఎం రమేష్ రావు తో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్పత్తి, పథకాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్ ఓ టు జి ఎం వెంకటేశ్వర్లు, పి యమ్ మురళీధర్ రావు, 23 సీఎం ఓఎ అధ్యక్షులు జక్కా రెడ్డి, కేకే ఓ సి పిఓ పద్మనాభరెడ్డి, డి వై పి ఎం శ్యాంసుందర్, తిరుపతి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాండ్ సెక్రటరీ సత్యనారాయణ, ఏరియా ఏజెంట్లు, అన్ని గనుల డిపార్ట్మెంటు అధికారులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Related Posts