YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ సమావేశాలు వేదికగా..వంశీ టెన్షన్

అసెంబ్లీ సమావేశాలు వేదికగా..వంశీ టెన్షన్

అసెంబ్లీ సమావేశాలు వేదికగా..వంశీ టెన్షన్
విజయవాడ, నవంబర్ 22,
వల్లభనేని వంశీని కట్టడి చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. వల్లభనేని వంశీ ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వాట్సప్ లో చంద్రబాబుకు నేరుగా మెసేజ్ మాత్రమే పంపారు. తర్వాత వల్లభనేని వంశీ తాను వైసీీపీలో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. నారాలోకేష్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీస్ పంపంది. సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి వల్లభనేని వంశీ కూడా సమాధానమిచ్చారు.అయితే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆశిస్తే ఆ పని మాత్రం చేయడం లేదు. ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేయకుండా స్వతంత్ర సభ్యుడిగానే ఉండాలని యోచిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అనుమానపడుతోంది. అందుకోసమే వల్లభనేని వంశీని సస్పెన్షన్ కే పరిమితం చేయాలని టీడీపీ భావిస్తుంది. వల్లభనేని వంశీని పార్టీ నుంచి బహిష్కరిస్తేఅది ఆయనకే అడ్వాంటేజీ అవుతందని చంద్రబాబు సయితం భావిస్తున్నారు.అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వల్లభనేని వంశీని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తుంది. వల్లభనేని వంశీపై ఇప్పుడు టీడీపీ సస్పెన్షన్ మాత్రమే వేసింది. ఒక పార్టీ సభ్యుడు సస్పెన్షన్ కు గురయితే పార్టీ విప్ వర్తిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బహిష్కరిస్తేనే విప్ వర్తించదని, సస్పెన్షన్ కు గురయితే అది తాత్కాలికమే కాబట్టి విప్ వల్లభనేని వంశీకి వర్తిస్తుందనేది టీడీపీ వర్గాలు చెబుతున్న విషయం.అందుకోసమే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విప్ జారీ చేయాలని టీడీపీ యోచిస్తుంది. వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు గైర్హాజరవ్వాలని యోచిస్తున్నట్లు తెలుసుకున్న టీడీపీ విప్ జారీ చేస్తే ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా అంశం మీద ఓటింగ్ కు పట్టుబట్టి విప్ జారీ చేయాలని చూస్తోంది. అప్పడు వల్లభనేని వంశీ విప్ ను థిక్కరిస్తే స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్మత వేటు వేయాలన్నది టీడీపీ యోచనగా ఉంది. వల్లభనేని వంశీ కూడా దీనికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వల్లభనేని వంశీ పని పట్టాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts