అటవీ ప్రాంతంలో గంజాయిపై నిఘా
విశాఖపట్టణం, నవంబర్ 21,
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో జోరుగు సాగుతున్న గంజాయి తోటల సాగుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారులు కళ్లుగప్పి దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఎలాంటి అనుమానం రాకుండా వేలాది ఎకరాల్లో సాగుతున్న అక్రమ గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించి వేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. గంజాయి తోటలు ఎక్కడ సాగు చేస్తున్నా వాటిని ఇట్టే పసిగట్టి తొలగించేలా ప్రభుత్వం డ్రోన్ నిఘా కళ్లతో మన్యం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ డ్రోన్లను ఉపయోగించి మన్యం ప్రాంతంలో గంజాయి తోటలను గుర్తించే పనుల్లో నిమగ్నమైంది. నాలుగు మండలాల్లోని అటవీ ప్రాంతంలో గంజాయి తోటలను గుర్తించే పనులు చేపట్టారు.అందులో భాగంగా పాడేరు, హుకుంపేట, పెదబయలు, మంచిగిపట్టు మండలాల్లో గంజాయి తోటలు జోరుగా సాగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ అక్రమార్కులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా వందలాది ఎకరాల్లో గంజాయి తోటలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఎవరూ రావడానికి వీలు లేనటువంటి ప్రాంతాలను ఎంచుకుని వీరు ఈ తోటలను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోటలను కూడా డ్రోన్ల సాయంతో గుర్తించి వాటిని ధ్వంసం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయితోటల వద్దకు ఇతరులు ప్రవేశించగానికి కూడా వీలు లేనంతగా స్మగ్లర్లు గంజాయిను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోటలను కూడా ఆర్టీజీఎస్ డ్రోన్ల సాయంతో గుర్తించి అక్కడికి వెళ్లి ఆ తోటలను ధ్వంసం చేయడానికి మార్గాలు కల్పిస్తోంది.ఇకపై నిరంతర నిఘా… ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై ఇక మీదట డ్రోన్లతో నిరంత నిఘా కొనసాగించనున్నారు. ఇందుకోసం ఆర్టీజీఎస్ సంస్థ ఎక్సైజు, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తోంది. అనుమానిత ప్రాంతాలు, మండలాల్లో డ్రోన్లను నిరంతరంగా ఉపయోగించి గంజాయి సాగును ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఇప్పటికే గంజాయి తోటల ధ్వంసం