YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

లంచాల జోలికి పోమంటూ రెవెన్యూ సిబ్బంది ప్రమాణం

లంచాల జోలికి పోమంటూ రెవెన్యూ సిబ్బంది ప్రమాణం

లంచాల జోలికి పోమంటూ రెవెన్యూ సిబ్బంది ప్రమాణం
సూర్యాపేట నవంబర్ 22 
తాము ఇక నుండి లంచాల తీసుకోబోమని ప్రమాణం చేశారు రెవెన్యూ ఉద్యోగులు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు మేరకు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ.. కోసం తాసిల్దార్ కార్యాలయంకి ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణం చేశారు. కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవం, మర్యాద ఇవ్వడంతో పాటు, వారు తీసుకువచ్చిన అర్జీలను నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను ఇలాంటి లంచాలు స్వీకరించబోమని ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు ప్రమాణం చేశారు. ఉద్యోగుల ప్రతిజ్ఞ కు స్పందించిన ఎమ్మెల్యే తాను కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించి రెవెన్యూ ఉద్యోగులను సిబ్బంది పెట్టబోమని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధిగా నేను, ఉద్యోగులుగా మీరు ప్రజల కొరకు పని చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు.

Related Posts