YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అక్రమ రవాణాపై ఉక్కుపాదం 

అక్రమ రవాణాపై ఉక్కుపాదం 

అక్రమ రవాణాపై ఉక్కుపాదం 
జోగుళాబ గద్వాల్ నవంబర్ 22   
జిల్లా లో  ఇసుక, పీడీఎస్ రైస్ మరియు  నిషేదిత గుట్కా  అక్రమ రవాణా నివారణకు  ప్రత్యేక చర్యలు   తీసుకుంటున్నాం.     ఇప్పటికే గడిచిన సంవత్సరం లో ఇసుక అక్రమ  రవాణా లో ఇప్పటి వరకు 566 మందిపై 334 కేసులు నమోదు, 3,622 టన్నుల ఇసుక సీజ్, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా విషయంలో 45 మంది పై 29 కేసులు నమోదు, 871 క్వింటాల బియ్యం పట్టివేశామరని గద్దవాల జిల్లా ఎస్పీ అపూర్వరావు అన్నారు.  ఇసుక, రేషన్  రైస్ అక్రమ రవాణా నిర్వహించే వారిపై కఠిన చర్యలు, వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు.    జోగుళాoబ గద్వాల్ జిల్లా లో ఇసుక,  రైస్ అక్రమ రవాణా నివారణకు ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకొని నివారిస్తున్నట్లు  జిల్లా ఇంచార్జి ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కు సరిహద్దులు గా ఉన్న కృష్ణ, తుంగభద్ర నది తీరా గ్రామాలలో పటిష్టమైన పోలీస్ భద్రత చర్యలతో పాటు ఇసుకు, పీడీఎస్ రైస్  అక్రమ రవాణా పై ప్రత్యేక బృందం చే నిఘా ఉంచినట్లు తెలిపారు.     గడిచిన ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 15 టిప్పర్లు, 257 ట్రాక్టర్లు, 4 లారీ లు పట్టుకొని 85 ఇసుక డంపులతో సహా  566 మందిపై  334 కేసులు నమోదు చేసి సుమారు 3,622 టన్నుల ఇసుకను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ కేసులలో 520 మంది నిందితులను ఇప్పటికే  అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా  పీడీఎస్  రైస్ అక్రమ రవాణా విషయంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 45 మంది పై 29 కేసులు నమోదు చేసి  871 క్వింటాల బియ్యం పట్టుకోవడం జరిగింది అని  దాదాపు వీరందరిని కూడా ఇప్పటికే అరెస్టు చేసి కోర్టు లో హాజరుపరిచడo జరిగింది అని అన్నారు. అలాగే పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా మరియు  కోడిపందెల ఆటలలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 400 మంది పై 49 కేసులు నమోదు చేసి  15,22,650/- రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది అని తెలిపారు.     నిషేదిత గుట్కావిషయం లో గడిచిన 9 నెలల కాలంలో  65 మంది నిందితులపై 47 కేసులు నమోదు చేసి సుమారు 32,02,800 /- రూపాయల విలువ గల గుట్కాను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అని  మరియు  గెమ్మింగ్ యాక్ట్, నిషేదిత గుట్కా   కేసులలో కూడా నిందితులనందరిని  జుడీషియల్ రిమాండ్ కు పంపించడం  జరిగింది అని అన్నారు.  
   జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా పై, అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో , బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్, బీట్ గస్తీలతో  24 గంటలు  పటిష్టమైన  నిఘా ఉంచాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇసుక, రేషన్  రైస్ అక్రమ రవాణా కు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు స్వచందంగా ముందుకు వచ్చి పోలీస్ ల దృష్టికి తీసుకరావాలి అని , అందించిన వారి వివరాలను ను గోప్యంగా ఉంచుతామని అన్నారు.   అక్రమ రవాణా చేసే వారి  పై పి.డి.యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 

Related Posts