టీడీపీ సంస్థాగత ఎన్నికలోపై చంద్రబాబు సమీక్ష
అమరావతి నవంబర్ 22
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తన నివాసంలోనే నాయకులతో భేటీలు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా పర్యటనల్లో కార్యకర్తల్లో ఉత్సాహం బాగుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిలో పట్టుదల పెరిగింది. వైసిపి నిర్వాకాలతో 6నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వుందని అన్నారు. దేవుడి గుడికి వైసిపి రంగులేస్తున్నారు. మహాత్మా గాంధీ విగ్రహాలకు వైసిపి రంగులు. జాతీయ పతాకం రంగులు చెరిపేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేస్తున్నారు. అభివృద్దిని రివర్స్ చేశారు, సంక్షేమాన్ని రద్దు చేశారు. అన్నా కేంటిన్లు మూసేశారు. చంద్రన్న బీమా రద్దు చేశారు. పేదలకు పండుగ కానుకలు నిలిపేశారు. గిరిజనుల ‘ఫుడ్ బాస్కెట్’ రద్దు చేశారు. వైసిపికి పిదప కాలం, అందుకే పిదప బుద్దులని విమర్శించారు. ఈ నెల 18నుంచి టిడిపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గ్రామ, మండల పార్టీ కమిటీల ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలి. క్షేత్ర స్థాయి నుంచి అనుబంధ సంఘాలు బలోపేతం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పటిష్ట నాయకత్వం రూపొందాలి. పంచాయితీ ఎన్నికలకు శ్రేణులను సంసిద్దం చేయాలి. మండల స్థాయిలో 14 అనుబంధ సంఘాలకు కమిటిలు. గ్రామ స్థాయిలో తెలుగు రైతు,తెలుగు మహిళ, తెలుగు యువత కమిటిలు. మొత్తం 16వేల గ్రామ కమిటిలకు ఎన్నికలు నిర్వహించాలి. 900 పైగా మండల, పట్టణ కమిటిలకు ఎన్నికలుంటాయని అన్నారు. డిసెంబర్ 25 కల్లా పార్టీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అయన అన్నారు.