YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

జేఏసీ ప్రతిపాదనపై స్పందించని ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల యూ టర్న్ ..మళ్లీ సమ్మె బాట

జేఏసీ ప్రతిపాదనపై స్పందించని ప్రభుత్వం  ఆర్టీసీ కార్మిక సంఘాల యూ టర్న్ ..మళ్లీ సమ్మె బాట

జేఏసీ ప్రతిపాదనపై స్పందించని ప్రభుత్వం
   ఆర్టీసీ కార్మిక సంఘాల యూ టర్న్ ..మళ్లీ సమ్మె బాట
హైదరాబాద్‌ నవంబర్ 22
  కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్‌ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.  కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన  సమ్మెపై ప్రస్తుతం  కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగాతెలంగాణ ఆర్టీసీ కార్మికులు ..నిరంతరాయంగా 48 రోజులు సమ్మె చేసారు.ఈ సమ్మె ప్రభావం తెలంగాణ ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రభుత్వం తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈ ఆర్టీసీ సమ్మె ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని నానా హైరానా సృష్టించారు. ఇక చేసేదేమి లేక కార్మికులు జేఏసీ నేతలతో కలిసి హై కోర్ట్ మెట్లు ఎక్కారు. హై కోర్ట్ లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ... కొద్ది రోజుల వాదనల తరువాత ఈ కేసుని లేబర్ కోర్ట్ కి ఫార్వర్డ్ చేసింది. ఈ మధ్య లోనే సీఎం కేసీఆర్ .. ఆర్టీసీ కథ ముగిసింది అని సగం రోడ్లని ప్రైవేట్ కి అప్పగిస్తున్నాం అని చెప్పారు. అలాగే కార్మికులకు ఉద్యోగం లో చేరాలని రెండు సార్లు డెడ్ లైన్ ఇచ్చారు. కానీ కార్మికులు సమ్మె ని కొనసాగించారు.  ఇక తాజాగా హై కోర్ట్ కేసుని ..లేబర్ కోర్టుకి ఫార్వర్డ్ చేయడంతో ఈ సమస్య ఇప్పుడప్పుడే తీరదని గమనించిన ఆర్టీసీ కార్మికులు జేఏసీ నేతలు చర్చించుకొని ... ప్రభుత్వం బేషరతుగా ఆహ్వానిస్తే సమ్మెను విరమిస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఉద్యోగంలో చేర్చుకోవాలని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు.కానీ ఈ నిర్ణయం పై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సమ్మెను విరమిస్తామని ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు నేడు మాట మార్చారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. 

Related Posts