పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వహించాలి
వనపర్తి నవంబర్ 22 (
పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వహిస్తూ 5ఎస్ నీ తప్పనిసరిగా అమలు పరచాలని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల, ఎస్ఎహ్వో ఎస్సైలకు, ఎస్ఎహ్వో వర్టీ కల్ అంశం మీద వర్టీకల్ ఇంచార్జి డిసీఆర్బీసీఐ,జమ్ములప్ప ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో 5-s తప్పనిసరిగా అమలు పరచాలని, 5ఎస్ పద్దతిలో క్రమపద్ధతిలో (క్రమబద్దీకరించడం) పోలీసుస్టేషన్లు, కార్యాలయాలకు సంబందించిన అన్ని రికార్డులను అవసరమైనవి ఒక దగ్గర, అవసరం లేనివి మరోదగ్గర, నిత్యం వాడుకలో ఉన్నవి మరో చోట క్రమబద్దీకరించుకోవడం ద్వారా ఏ వస్తువు/రికార్డు/ఫైల్ ఎక్కడ ఉందో త్వరగా తెలుసుకోగల్గుతామనివాటిని (క్రమపద్ధతిలో) లో ప్రత్యేక పేరు, సంఖ్య, కలర్స్, బోర్డులు, పార్కింగ్ స్లాట్ ట్యాగ్ లు మొదలగు ప్రతి అంశాన్ని నిల్వ పద్దతిలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాటి నిల్వ స్థలాన్ని గుర్తించడం సులభం అవుతూ సమయం ఆదా అవడంతో పాటు ఇతర కార్యాచరణతో ముందుకు వెళ్ళవచ్చు అని,(మెరిపించుట)లు స్టేషన్ సిబ్బందికి వారి పని ప్రాంతం, సామగ్రి మొదలైన వాటిని శుభ్రం చేసుకొనుటకు వారికి బాధ్యతను అప్పగించి వ్యర్థాల తొలగింపు పద్ధతి ,బాధ్యతలు అప్పగించి ఆయా ప్రాంతాలను మెరిసేటట్లు చూడాలని అలాగే పోలీస్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని హహ్లాద వాతావరణాన్ని కల్పించాలని , స్టేషన్లలో క్రమమైన విధానంలో మరియు ఏకరితి పద్దతిలో వస్తువులను (ప్రమాణికరించుట)/ అమర్చడం ద్వారా మొత్తం వ్యవస్థ ప్రదర్శన పెరిగుతుందిని, ఫలితంగా ఉద్యోగులు, సందర్శకులు మరియు వినియోగదారులు ఇతరులను అడగకుండానే ప్రాంతాలను, పరికరాలను మరియు చర్యలను గుర్తించవచ్చని, స్టేషన్లలో ప్రతి ఒక సిబ్బంది ( స్వీయ క్రమశిక్షణ) కలిగి ఉండి నిరంతరాయంగా 5-S కార్యాలపాలను మెరుగు పరుచుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎస్సైలు గ్రామాల్లో నేను సైతం, షీ టీమ్స్ ద డయల్ 100, మహిళలపై జరిగే నేరాల గురించి, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత,సైబర్ నేరాలపై వివిధ చట్టాలు, ఆత్మహత్యలు, చెడుఅలవాట్లు లాంటి పలువిషయాలపట్ల ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు ఎస్పీ గారు తెలిపారు. వర్టీకల్ భాగంగా స్టేషన్ పరిపాలన అధికారులు స్టేషన్ యొక్క పర్యవేక్షణ, నాణ్యమైన విచారణ కోసం దర్యాప్తు అధికారులను పర్యవేక్షించడం మరియు మార్గదర్శకత్వం చేయడం గురించి, లా అండ్ ఆర్డర్ బందోబస్తు గురించి, నేరాలనివారణలో పెట్రోల్ కార్స్, బ్లూ కోలర్ట్స్, సిబ్బందిని ప్రోత్సహించే బాధ్యత గురించి, ఇతర అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణకార్యక్రమంలో అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్,డిసీఆర్బీ సిఐ, జమ్ములప్ప,శిక్షణ నిర్వాహకులు,ఐటీ సెల్ ఇంచార్జి గోవింద్, ఐటీ సెల్ సిబ్బంది, మన్యం, విజయ్, మురళి, మరియు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల నుండి వచ్చిన రిసెప్షన్ సిబ్బంది పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.