YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై కేంద్రంఎందుకు స్పందించతం లేదు: పొన్నం

ఆర్టీసీ సమ్మెపై కేంద్రంఎందుకు స్పందించతం లేదు: పొన్నం

ఆర్టీసీ సమ్మెపై కేంద్రంఎందుకు స్పందించతం లేదు: పొన్నం
హైదరాబాద్ నవంబర్ 22
;: ముప్ఫై శాతం వాటా ఉన్నప్పటికీ ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం ఎందుకు స్పందించలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని నిలదీశారు. సమ్మె జరిగిన 48 రోజులపాటు మౌనంగా ఉండడంలో అర్ధమేమిటన్న ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె దాదాపు ముగియనున్న తరుణంలో బీజేపీ ఇప్పుడు ఏదో చేస్తున్నట్లు, ప్రయత్నాలు చేసినట్లు నటిస్తుందని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి ఫోన్‌లో ప్రయత్నం చేస్తే ‘ఆయన కలవలేదు’ అని చెబుతున్నారంటే... బీజేపీ‌కి తల దించుకుని పరిస్థితి వచ్చినట్లేనని వ్యఖ్యానించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుంది ? అని ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్ఎస్ లు ఢిల్లీలో దోస్తీ, గల్లీ లో కుస్తీ లాగా నటిస్తున్నారని ప్రభాకర్ ధ్వజమెత్తారు.నడ్డాపైన కేటీఆర్ మాట్లాడుతారని, నడ్డా ఇక్కడ వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే... వాటిపై సీబీఐ తో ఎందుకు విచారణ జరిపరని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెపై బీజేపీ ఏం చేస్తుందని నిలదీశారు. సమ్మె జరిగిన 48 రోజులు ఏమి చేయకుండా మౌనంగా ఉండి ఇప్పుడు ఏదో హల్చల్ చేస్తే ఎవరునమ్ముతరని ధ్వజమెత్తారు.టిఆర్ఎస్ ఒక దుర్మార్గానికి ఒడికడుతుంటే బీజేపీ ఏం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీకి ఒక సామరస్య పరిష్కారం చూపాలని హితవు పలికారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందాన మిడ్ మానేరు ప్రాజెక్ట్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ నిన్న సందర్శించారంటూ తూలనాడారు.‘లీకేజీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే తప్పు అంటున్నారు. అంటే మిడ్ మానేరును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఒప్పుకుంటున్నారు కదా ! అని ప్రశ్నించారు. ఒకవేళ కాంగ్రెస్ హయాంలోనే తప్పిదం జరిగితే... ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా... ఎందుకు విచారణ జరిపి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.‘ఆర్టీసీ, మిడ్ మానేరు అంశాలలో టిఆర్ఎస్, బీజేపీలకు బాధ్యత ఉంది. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Related Posts