ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్సై
హైదరాబాద్ నవంబర్ 22 (న్యూస్ పల్స్) విసిగిన ఏ ఎస్సై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తనను అకారణంగా సీఐ బదిలీ చేయించాడంటూ హైదరాబాద్లోని బాలాపూర్ పీఎస్ పరిధిలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యా యత్నం చేశారు. సీఐ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నరసింహ ఇటీవలే బదిలీపై బాలాపూర్ నుంచి మంచాల పీఎస్కు వెళ్లారు. ఆ బదిలీకి సీఐ కారణమని ఆరోపిస్తూ...నగర శివారులోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయాల పాలైన ఏఎస్సైని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.