YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'సవ్యసాచి'కి అనూహ్యమైన రెస్పాన్స్ ! జూన్ 14న విడుదల

'సవ్యసాచి'కి అనూహ్యమైన రెస్పాన్స్ ! జూన్ 14న విడుదల

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఈ సినిమా కథ ఏమైవుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది చిత్ర యూనిట్ సమాచారం. ఈ సినిమాలో భూమిక చైతన్య అక్క పాత్రలో నటిస్తోంది. ఆమెకి జరిగిన అన్యాయానికి తమ్ముడిగా చైతన్య ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశమని చిత్ర వర్గాలు తెలిపాయి.  ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక పాత్రలో, విలన్ గా మాధవన్ కనిపించనున్నాడు. రావు రమేష్  పాత్ర కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చిత్ర వర్గం తెలిపింది.

Related Posts