అధికారం వస్తే టీడీపీలోకి మళ్లీ వస్తారు
విజయవాడ,
టీడీపీ నుంచి స్క్రాప్ మొత్తం బయటకు వెళ్లిపోయిందంటున్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించారని.. పార్టీ మారిన వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే సొంత గూటికి వచ్చామంటారని.. అధికారాన్ని బట్టి పార్టీలు మారే వాళ్లను జగన్ కూడా నమ్మడు అన్నారు. పచ్చగా ఉందని వైసీపీలోకి వెళ్లారని.. తిరిగి ఎండటం ప్రారంభంకాగానే బయటికి వచ్చేస్తారని వ్యాఖ్యానించారబీజేపీతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఉమా కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని.. ఒకవేళ 20మంది టీడీపీలు బీజేపీలో చేరితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారపాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే.. టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారన్నారు ఉమా. టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామంటే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. 2016లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి హోదాలో తెలుగు లెస్సా అంటూ జగన్ ట్వీట్ చేశారని.. కేసీఆర్‌ను చూసి నేర్చుకోమని సొంత మీడియా సాక్షిలో రెండు భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాసిన మాట వాస్తవం కాదా అన్నారు. 2019లో అధికారం లోకి వచ్వాక ఏబీసీడీలు కనుగొన్నట్లు గొప్పలు చెబుతున్నారని.. జగన్ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంగ్లీషు భాషను పరిచయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారటీడీపీ హయాంలోనే తెలుగు, ఇంగ్లీషు మీడియంలకు సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు ఉమా. అప్పుడు జీవో నంబర్-14 ద్వారా ఇంగ్లీషు పరిజ్ఞానం పెంచేలా టీచర్స్ కు శిక్షణ ఇచ్చామని.. జీవో నంబర్ 78 ద్వారా అన్ని పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ఉండాలని చెప్పామన్నారు. జీవో 23 ద్వారా బాలికలకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా.. సొంత ఎజెండాలతోనే ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇంగ్లీషు బోధించడానికి టీచర్లు సమాయత్తం చేయకపోతే.. పిల్లలకు ఏం చెబుతారని ప్రశ్నించారభాష పేదలకు అందకుండా చేస్తున్నామని టీడీపీపై నిందలు వేయడం సరికాదన్నారు టీడీపీ నేత. టీడీపీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఐటీ కంపెనీలలో పేదలు ఉద్యోగాలు సంపాదించారన్నారు. నాడు-నేడు కార్యక్రమం ను జగన్, మంత్రులు గొప్పగా చెప్పుకుంటున్నారని.. ఇది ఒక బోగస్ కార్యక్రమం.. మీ పార్టీ రంగులు వేసుకోవడానికే ఈ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చర్చకు రావాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలన్నారు.