YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆర్టీసీలో కొనసాగుతున్న మరణాలు

ఆర్టీసీలో కొనసాగుతున్న మరణాలు

ఆర్టీసీలో కొనసాగుతున్న మరణాలు
హైద్రాబాద్, 
ఆర్టీసీలో కార్మికుల అకాల మరణాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదనే మనస్తాపంతో అనారోగ్యానికి గురై ఓ డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. అతడి మృతదేహంతో ఆందోళన చేస్తుండగా మరో కార్మికుడు సొమ్మసిల్లి పడిపోవడం విషాదం. వికారాబాద్ జిల్లా పరిగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం మండిపల్‌ గ్రామానికి చెందిన వీరభద్రయ్య (42) అనే కార్మికుడు పరిగి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో విధులు మానేసి ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నాడు.సమ్మె ప్రారంభమై 47 రోజులకు పైగా అవుతున్నా.. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని వీరభద్రయ్య దిగులు చెందాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై వారం రోజులుగా సరిగా ఆహారం తీసుకోలేదు. దీంతో అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు గురువారం (నవంబర్ 21) రాత్రి అతడిని వికారాబాద్‌లోని ఓ పైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరభద్రయ్య శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆర్టీసీ కార్మికులు, బంధువులు అతడి మృతదేహంతో పరిగి డిపో ఎదుట ఆందోళనకు దిగారు. బీజాపూర్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తుండగా.. శ్రీనివాన్‌ అనే మరో డ్రైవర్‌ స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన తోటి కార్మికులు అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.ఆర్టీసీ సమ్మె కాలంలో 30 మందికి పైగా కార్మికులు మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. 48 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. షరతులు విధించకుంటే విధుల్లో చేరడానికి సిద్ధమంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డిపోల ముందు కార్మికులు బారులు తీరుతున్నారు.

Related Posts