YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఐదేళ్లు... శివసేన సీఎమ్మె

ఐదేళ్లు... శివసేన సీఎమ్మె

ఐదేళ్లు... శివసేన సీఎమ్మె
ముంబై, 
కాంగ్రెస్- ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నుంచి మళ్లీ ఎలాంటి ప్రతిపాదనలూ తమకు రాలేదని, ఇకపై బేరసారాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీతో జట్టుకట్టేది లేదని, ఇంద్రుడి సింహాసనాన్ని ఇస్తామన్నా ఆ పార్టీతో కలిసేది లేదని తెగేసిచెప్పారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో శివసేనకు చెందిన నేత ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన పునరుద్ఘాటించారు.ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ఉండాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని సంజయ్ రౌత్ ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్న పక్షాలతో కలిసి గవర్నర్‌ని కలవనున్నారా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. రాష్ట్రపతి పాలన అమలులో ఉండగా గవర్నర్‌ని కలవడం దేనికి? అని ఎదురు ప్రశ్నించారు. బీజేపీపై విమర్శల్లో భాగంగా ‘‘ఆత్మాభిమానం కోసం ఒక్కోసారి బంధాల్ని తెంచుకోవడమే మంచిదని.. ఇది అహంకారం కాదంటూ’’ సంజయ్ ట్వీట్‌ చేశారు.కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌-ఎన్సీపీ, శివసేన శుక్రవారం తుది విడత చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్-ఎన్సీపీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, శుక్రవారం శివసేనతో సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ భేటీలో భాగంగా ఎన్నికలకు ముందు తమతో కలిసిన ఇతర చిన్న పార్టీలతో కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుని మద్దతు కోరనున్నారు.వివిధ పార్టీల చేరికతో ఏర్పాటవుతున్న కొత్త కూటమికి ‘మహా వికాస్‌ ఆఘాడీ’గా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ‘మహా వికాస్‌ ఆఘాడీ’కి నాయకత్వం వహించాలని ఉద్ధవ్ ఠాక్రేను గురువారం రాత్రి జరిగిన భేటీ సందర్భంగా శరద్ పవార్‌ ఒప్పించే ప్రయత్నం చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఉండాలని పవార్ కోరినట్టు తెలుస్తోంది.ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ కూడా పవార్ అభిప్రాయంతో ఏకీభవించారని, ఉద్ధవ్‌ను సీఎం పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. పదవుల పంపకంపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మూడు పార్టీల ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం నిర్వహించనున్నారు.ఈ సినిమా మొత్తం ఉస్మానియా యూనివర్శిటీ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండటంతో ప్రత్యేకించి సెట్ వేశారు. అయితే చాలా వరకూ రియల్ లొకేషన్స్ కనిపించినప్పటికీ 1970 నాటి నేటివిటీ మిస్ అయ్యింది. ప్రజెంట్ లొకేషన్స్‌ మాదిరే కనిపించాయి చాలా సీన్స్.ఇక హీరోయిన్‌ ముస్కాన్.. మాయ పాత్రలో ఆకట్టుకుంది. వన్ సైడ్ లవర్‌గా ఉన్నంతలో పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. జార్జి తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక ఎమోషన్స్ బాగా పండించింది. తల్లీకొడుకుల ఎమోషన్స్ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. సత్యదేవ్‌, మనోజ్‌ నందం, అభయ్‌, పటాస్ యాదమరాజులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. పటాస్ యాదమరాజు తెలంగాణ యాసలో పేల్చిన పటాస్‌లు పేలాయి. అతని తండ్రికి జార్జి షర్ట్ ఇచ్చే సీన్ హైలైట్ అయ్యింది.ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేష్‌ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్. హీరోయిజం ఎలివేట్ చేయడంలో అతని బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్లకు మరింత బలాన్ని ఇచ్చింది. సాంగ్స్ కూడా సందర్భానుసారంగా ఉన్నాయి. మంగ్లీ పాడిన ‘వాడు నడిపే బండి’ పాట బాగుంది. మరాఠి సినిమా ‘సైరత్’ కు ఫొటోగ్రఫీని అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు పనిచేయడంతో ఆయన కెమెరా పవర్‌ను మరోసారి ‘జార్జిరెడ్డి’తో చూపించారు. ముఖ్యంగా ఫైర్ ఫుడ్ బాల్, బ్లేడ్ ఫైట్‌లతో అతని కెమెరా పనితనం అద్భుతం. ఉస్మానియా సెట్‌ను రియలిస్టిక్‌గా చూపించారు. చిన్న సినిమానే అయినప్పటికీ నిర్మాత అప్పిరెడ్డి నిర్మాణ విలువలు గ్రాండ్‌గా అనిపిస్తాయి. రన్ టైం మరీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.. సెకండాఫ్‌లో కత్తెర పడాల్సిన సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

Related Posts