YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తమ్ముడి కోసం నల్లారి త్యాగాలు

తమ్ముడి కోసం నల్లారి త్యాగాలు

తమ్ముడి కోసం నల్లారి త్యాగాలు
చిత్తూరు, 
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి… ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరి నామినేటెడ్ పదవి పొందారు. సోదరుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా యాక్టివ్ గా లేకపోవడం వల్లనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టీడీపీలో చేరడానికి కిషోర్ కుమార్ రెడ్డి సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి అనుమతి కూడా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో అప్పటి మంత్రి అమర్ నాధ్ రెడ్డితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిన తర్వాత డీల్ సెట్ అయిందంటారు.గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజవకర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. చంద్రబాబు ఆయనకు అదనంగా పుంగనూరు బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే సోదరుడు టీడీపీ తరుపున పోటీ చేసినా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి తరుపున ప్రచారం చేయలేదు. సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ లో బస చేసి సోదరుడు విజయం కోసం తన అనుచరులకు కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు ఇచ్చారంటారు. అయినా కిషోర్ కుమార్ రెడ్డి దారుణంగా పీలేరులో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పరిస్థితి మారింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కే అవకాశముంది. పీసీసీ చీఫ్ పదవి కానీ, ఏఐసీీసీలో ముఖ్యమైన పదవికి ఆయనను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి అన్ని రకాలుగా సహకరించాంటారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసే బాధ్యతలను అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కు అప్పగించారని, ఆయన సక్సెస్ ఫుల్ గా పని పూర్తి చేస్తారంటారు.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ లో ముఖ్యమైన పదవి దక్కితే కిషోర్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సోదరుడు ముఖ్యమైన పదవిలో ఉన్నప్పుడు తాను వేరే పార్టీలో ఉండటం సరికాదని ఇప్పటికే సన్నిహితుల వద్ద కిషోర్ కుమార్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజవర్గానికి, టీడీపీకి దూరంగా ఉంటున్నారు. సోదరుడికి కనుక కీ పోస్టు దక్కితే ఆయన పసుపు కండువాను తీసేస్తారంటున్నారు.

Related Posts