YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్రలో అనూహ్య మలుపు కొలువు తీరిన బీజేపీ, ఎన్సీనీ సర్కార్

మహారాష్ట్రలో అనూహ్య మలుపు కొలువు తీరిన బీజేపీ, ఎన్సీనీ సర్కార్

మహారాష్ట్రలో అనూహ్య మలుపు
కొలువు తీరిన బీజేపీ, ఎన్సీనీ సర్కార్
ముంబాయి నవంబర్ 23 
మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగింది. గంటల వ్యవధిలోనే సమీకరణాలు తారుమారు అయ్యాయి. ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఊహించని ఈ పరిణామాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి. శనవారం ఉదయం   ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఫడ్నవీస్ తో ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేసాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ ను మోడీ అభినందించారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ-ఎన్సీపీ సర్కారు పనిచేస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉదయం ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ ప్రజలకు సుస్థిరమైన పాలన అందిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సుస్థిర పాలన కోసమే ఎన్సీపీ తమకు మద్దతిచ్చిందన్నారు. అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందన్నారు. ప్రజాతీర్పును శివసేన అవమానించిందన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం అవసరం… కిచిడీ ప్రభుత్వం కాదన్నారు. ఫలితాల తర్వాత ఇతరులతో పొత్తుకు శివసేన వెంపర్లాడిందన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపినట్టు చెప్పారు. మరోవైపు, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను తొలగిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ ఉత్తర్వులు జారీ చేసారు. 

Related Posts