YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో దారుణం

విశాఖలో దారుణం

విశాఖలో దారుణం
విశాఖపట్టణం, నవంబర్ 23  
సాగరతీర నగరం విశాఖలో దారుణం జరిగింది. మహిళపై అత్యాచారం చేసి.. నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు దిగాడో కేటుగాడు. తర్వాత కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తర్వాత డబ్బు కోసం ఆమెను వేధించాడు.. డబ్బు ఇచ్చినా తర్వాత కూడా టార్చర్ పెట్టాడు. తన దగ్గర డబ్బు లేవన్నా వినకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ కేసులో ట్విస్ట్‌లతో పోలీసులే షాక్ తిన్నారు.విశాఖకు చెందిన మహిళ ప్రభుత్వ ఉద్యోగి.. ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయ మాటలు చెప్పాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చిన అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ మళ్లీ ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత డబ్బు కావాలంటూ ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు పరువు పోతుందని భావించి.. అప్పులు చేసి మరీ రూ.50 లక్షలకు పైగా డబ్బు తెచ్చి ఇచ్చిందిఎంత డబ్బు ఇచ్చినా ఆ దుర్మార్గుడు వేధింపులు ఆపలేదు.. డబ్బు కావాలంటూ మళ్లీ టార్చర్ పెడుతూనే ఉన్నాడు. అతడికి తల్లిదండ్రులు కూడా వంతపాడారు. కొడుకు అరాచకాలను తప్పుబట్టాల్సిందిపోయి.. డబ్బు తేవాలంటూ ఆమెను బెదిరించారు. అంతటితో ఆగకుండా మృగాడు నగ్న ఫోటోలను తన స్నేహితుడికి ఇచ్చి.. అతడి ద్వారా కూడా డబ్బు వసూలు చేయించాడు. తర్వాత బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.కేసు నమోదైనా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో.. కనిపించకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. తర్వాత పోలీస్ అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని నిందితుడితో పాటూ అతడి తండ్రిని, స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ట్విస్ట్‌లతో పోలీసులకే దిమ్మ తిరిగింది.

Related Posts