YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

హైదరాబాద్ మెట్రో.. త్వరలో ఐటీ ఉద్యోగులకు ఊరట

హైదరాబాద్ మెట్రో.. త్వరలో ఐటీ ఉద్యోగులకు ఊరట

హైదరాబాద్ మెట్రో.. త్వరలో ఐటీ ఉద్యోగులకు ఊరట
హైద్రాబాద్, నవంబర్ 23  
హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ఐటీ ఉద్యోగులకు మరింతగా ఉపయోగపడనున్నాయి. ఐటీ కారిడార్‌లో మరి కొద్ది రోజుల్లోనే మెట్రో రైలు మైండ్ స్పేస్ వరకు రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. నవంబర్ 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ నవంబర్ 29న మైండ్‌స్పేస్ స్టేషన్ వరకు మెట్రో రైలును ప్రారంభించనున్నారు.దీంతో మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే.. ట్రాఫిక్ జామ్‌ నుంచి వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది.ఇప్పటి వరకూ హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. వాస్తవానికి ఆగష్టు చివరి నాటికే మెండ్ స్పేస్ స్టేషన్ వరకు మెట్రో సేవలను పొడిగించాల్సింది. కానీ ఇంజినీర్ల నుంచి సేఫ్టీ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆలస్యమైంది.మెట్రో కారిడార్‌-2 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న పది కి.మీ. మార్గాన్ని కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి

Related Posts