YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 ప్రైవేట్ ఆపరేటర్లతో భారమేనా

 ప్రైవేట్ ఆపరేటర్లతో భారమేనా

 ప్రైవేట్ ఆపరేటర్లతో భారమేనా
హైద్రాబాద్, నవంబర్ 23
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసలు రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల సాధారణ ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ది జరుగుతుందా? నష్టం జరుగుతుందా? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో 10వేలకు పైగా రూట్లు ఉన్నాయి. అందులో కొన్ని లాభాలు వచ్చే రూట్లు ఉన్నాయి. కొన్ని నష్టాలు వచ్చే రూట్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తం రూట్లలో సుమారు 50 శాతం  ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 50 శాతంలో 30 శాతం రూట్లను ఆర్టీసీ కార్పొరేషన్ బస్సులు నడుస్తాయి. మరో 20 శాతం ఆర్టీసీ కార్పొరేషన్ కింద అద్దె బస్సులు నడుపుతారు.రూట్లను ప్రైవేటీకరించడం అంటే ఆయా మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు తమ బస్సులను నడుపుతారు. ఆ బస్సుల్లో డ్రైవర్, కండెక్టర్ కూడా ప్రైవేట్ వాళ్లే ఉంటారు. అలా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంవత్సరానికి కొంత మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆ బస్సుల్లో టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే ఎక్కువ ధరలు వసూలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల పాస్‌లు (విద్యార్థులు, జర్నలిస్ట్ పాస్‌)లు కూడా ప్రైవేట్ రూట్లలో చెల్లుబాటు అవుతాయని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాభాలు, నష్టాలు వచ్చే అన్ని మార్గాల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతారని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానంలో ఆర్టీసీని నడపడం అసాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అంటే దాంట్లో కొంత మార్పులు చేసి నడపాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టం ఆయనకు ఆయుధంగా మారింది.ప్రభుత్వం తీసుకొచ్చిన రూట్ల ప్రైవేటీకరణ వల్ల ప్రయాణికులకు ఎలాంటి లాభం జరుగుతుందనేది పరిశీలిస్తే... వారికి కొత్త కొత్త బస్సులు, అందులో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అయితే, రేట్ల విషయంలోనే కొంత అనుమానం. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్‌ను పరిశీలిస్తే.. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ, పండుగల సమయాల్లో ఎలా వసూలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇలాంటివి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా అమలు చేస్తే ప్రయాణికుల జేబులకు కొంత చిల్లు తప్పదు. దీంతోపాటు ధరల నియంత్రణకు ప్రభుత్వం ఓ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆకమిటీ ఎప్పటికప్పుడు ధరలను సవరించడానికి చాన్స్ ఉంది. టికెట్ రేట్లు పెంచితే ప్రజలు ఓట్లు వేయరేమోననే భయంతో ప్రభుత్వాలు బస్సుల టికెట్ ఛార్జీలు పెంచకుండానే నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వంతో పనిలేకుండా ఎప్పటికప్పుడు ధరల సవరణ జరుగుతూ ఉంటుంది.ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో సుమారు 50వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వారంతా కలసి 10వేల రూట్లలో బస్సులు నడుపుతున్నారు. అందులో 50 శాతం ప్రైవేటీకరిస్తే.. సగం మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. వారిని ఏం చేస్తారు? ఎలా వినియోగించుకుంటారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం (సీఎం కేసీఆర్) మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. అయితే, అధికారవర్గాల సమాచారం ప్రకారం.. దీనిపై తొలుత ఓ కమిటీ ఏర్పడుతుందని, రూట్ల ప్రైవేటీకరణ, కార్పొరేషన్ ఆస్తులు, కార్మికుల భవిష్యత్తు ఇతర అంశాలపై ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. ఆ కమిటీ రిపోర్టును బట్టి ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉంది. 

Related Posts