డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమి పూజ
నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన నిర్వహించారు.ఇందులో 216 డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. జీ ప్లస్ టు ప్రణాళికలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన రెండు ఫ్లోర్లు నిర్మాణం చేపడతారు అని అన్నారు. మహాగామ్ గ్రామానికి వెళ్లే దారిలో అన్ని సౌకర్యాలు ఉండేవిదంగా ఈ ఇళ్ల ను నిర్మిస్తామని తెలిపారు. ఇళ్లులేని నిరుపేదలకు తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా ఇంతమంచి ఇళ్లని నిర్మించి ఇస్తుందని తెలిపారు. అదేవిదంగా భైంసా పట్టణం సమీపంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఎల్లప్పుడూ నీళ్ళతో నిండి ఉండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో నోమ్ప్ ప్రయత్నం చేస్తామని అన్నారు. అనంతరం అక్కడి నుంచి ముధోల్ లో నిర్మాణం చేపట్టనున్న ఎమ్మెల్యే హెడ్ క్వార్ట్రర్ భావన నిర్మాణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజక వర్గ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తో పాటు టీఆరెస్ పార్టీ నాయకులు , అధికారులు ఉన్నారు.