YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇసుక కొరతకు పరిష్కారం ..(ప్రకాశం)

ఇసుక కొరతకు పరిష్కారం ..(ప్రకాశం)

కొరతకు పరిష్కారం ..(ప్రకాశం)
ఒంగోలు, : ఇసుక కొరత నుంచి బయట పడాలంటే కొత్త మార్గాలను అన్వేషించాలి. జలాశయాల్లోనూ, ప్రాజెక్టుల్లోనూ ఇసుక పెద్దఎత్తున మేటలు వేసింది. దాన్ని తీయడం వల్ల ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఆ ఇసుకను ప్రభుత్వం ద్వారా విక్రయిస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ప్రజల అవసరాలు తీరుతాయి. పీబీ ఛానల్‌ ఆనకట్ట వద్ద 23 ఏళ్లుగా 25 లక్షలకు పైగా క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేట వేసి ఉంది. దాన్ని విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ఇసుకను తొలగించడం వల్ల 7,300 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుతో పాటు అదనంగా మరో మూడు వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్ఛు ఇది నాణ్యమైన ఇసుక. దీన్ని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించి... ఖర్చు తగ్గించవచ్ఛు పాలేరు- బిట్రగుంట ఛానల్‌ అభివృద్ధికి 2011 నుంచి 2014 వరకు రూ. 18 కోట్ల జైకా నిధులు ఖర్చు చేశారు. ఆ నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో విఫలమైన ఫలితంగా... ప్రారంభానికి ముందే నిర్మించిన కాలువలు, చిన్నపాటి కల్వర్టులు పగుళ్లిచ్చాయి. ఆ నగదు మొత్తం కాలువలో పోసినట్లయింది. ఇంకోవైపు పీబీ ఛానల్‌లో 25 లక్షలకు పైగా క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక మేట వేయడంతో నీటి నిల్వ సామర్థ్యమూ తగ్గింది. ఇసుక మేటను తొలగిస్తే... ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యమూ పెరుగుతుంది. కానీ, ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి... ప్రాజెక్టు సైతం నిరుపయోగంగా మారింది. సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లోని తొమ్మిది సాగునీటి చెరువులకు సకాలంలో నీటిని అందించి... వాటి ఆయకట్టులోని పంటలు ఎండుముఖం పట్టకుండా కాపాడేందుకు 1962లో పాలేరు నది బేసిన్‌పై జిల్లెలమూడి, నర్శింగోలు సరిహద్దుల్లో ఆనకట్ట నిర్మించారు. నదిపై 274 మీటర్ల పొడవు, 3.15 మీటర్ల ఎత్తు మేర ఆనకట్ట ఏర్పాటు చేశారు. ఈ ఆనకట్ట సింగరాయకొండ మండల రైతులకు కల్పతరవు. సింగరాయకొండ మండలంలోని 8 చెరువులకు, జరుగుమల్లిలోని కె.బిట్రగుంట చెరువుకు సకాలంలో సాగు నీరందించడం ద్వారా వరి సాగు చేసేవారు. అధికారికంగా 7,300, అనధికారికంగా మరో మూడు వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేవారు. ఆనకట్ట నుంచి 21.44 కి.మీ దూరంలోని చెరువులకు కాలువల ద్వారా నీరందించే ఏర్పాట్లు చేశారు. 1979లో వచ్చిన వరదలకు ఆనకట్ట వద్ద ఇసుక మేటలు వేసినా 1990 వరకు సాగుకు ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఆ తర్వాత 1996లో రాళ్లపాడు జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో కట్టలు తెగి.. ఉద్ధృతంగా ప్రవహించడంతో పీబీ ఆనకట్ట వద్ద మరో మారు పెద్దఎత్తున ఇసుక మేటేసింది. అప్పటి వరకు 0.73 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆనకట్ట గత కొన్నేళ్లుగా నీటి ప్రవాహంతో కలిసొచ్చిన ఇసుక మేటతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. నీరు నిలువని పరిస్థితి నెలకొంది. వచ్చిన వర్షపు నీరంతా పాలేరు ద్వారా సముద్రంపాలవుతోంది.
పాలేరు- బిట్రగుంట ఛానల్‌ అభివృద్ధికి 2011లో జైకా నిధులు రూ. 18.30 కోట్లు కేటాయించారు. ఆ నిధులను 2014 వరకు ఖర్చు చేశారు. కానీ, ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలియడం లేదన్నది రైతుల మాట. పూర్తయిన కల్వర్టుల్లో ఒకటి, రెండు కూలిపోయే పరిస్థితికి చేరాయి. ఎటు చూసినా పగుళ్లతో పాత కల్వర్టులే నయమనే పరిస్థితి కనిపిస్తోంది. రూ. కోట్లు ఖర్చు చేసినా.. రైతులకు మాత్రం సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. పీబీ ఛానల్‌ను వినియోగంలోకి తేవాలంటే... ఆనకట్ట వద్ద మేట వేసిన లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీయించాలి. ఇసుక విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో ఆనకట్టతో పాటు తొమ్మిది చెరువులను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయించవచ్ఛు ప్రభుత్వం గతంలో ఇసుక తీయించేందుకు యత్నించినా... ఆనకట్ట పరిధిలో బోర్లు ఏర్పాటు చేసిన వారు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఇసుక మేటలను తొలగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా... పట్టించుకోకపోవడంతో పాకలకు చెందిన కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గత అక్టోబరులో కోర్టు ఆనకట్టలోని ఇసుకను తొలగించాలని అధికారులకు నిర్దేశించింది. కోర్టు తీర్పును గౌరవించాలంటూ ఓ వైపు అధికార యంత్రాంగం ముందుకు పోతుంటే... మరో వైపు రాజకీయ అడ్డంకులు ప్రతిబంధకంగా మారాయి. 25 లక్షలకు పైగా క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉంది. దాన్ని తీసి తరలిస్తే.. కొరత నివారించవచ్ఛు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితే ఆనకట్టకు పూర్వ వైభవం సాధ్యమవుతుంది. సాగునీటికి ఇబ్బంది లేకుండా... 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మేట వేసిన ఇసుకలో కొంతైనా తొలగిస్తే... వరదలు, భారీ వర్షాల సమయంలో నీరు నిలుస్తుంది. పది వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. గత ఎనిమిదేళ్లుగా ఆయకట్టు పరిధిలోని రైతులు ఆరుతడి పంటల సాగుకు దూరమయ్యారు.

Related Posts