'ఛలో' మూవీ భారీ విజయాన్ని సాధించడంతో, ఆయనకి అవకాశాలు ఎక్కువయ్యాయి. కొత్త దర్శకులు చాలామంది ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కథకి ప్రాధాన్యతనిస్తూ, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకొని 'నర్తనశాల' తో సెట్స్ పైకి వెళ్లాడు. ఆ తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా వరుసగా అవకాశాలు కలిసొచ్చి కాలింగ్ బెల్ కొడుతుండటంతో, నాగశౌర్య తన పారితోషికాన్ని 4 కోట్లు చేసినట్టు సినిమా వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు మూడు హిట్లు పడితే నాగశౌర్య ట్రాక్ ఎక్కేసినట్టే అని సినిమా వర్గాలు అంటున్నాయి.