YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఫ్లై ఒవర్ నుంచి పడిన కారు…మహిళ మృతి

ఫ్లై ఒవర్ నుంచి పడిన కారు…మహిళ మృతి

ఫ్లై ఒవర్ నుంచి పడిన కారు…మహిళ మృతి
హైదరాబాద్:
ఫ్లై ఓవర్పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడటంతో కారులో ఉన్న ముగ్గురితో పాటు.. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒక మహిళ మృతి చెందింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఫ్లై ఓవర్ కింద ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఈ వారంలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.

Related Posts