YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

అంగన్వాడీల్లో గుడ్లు, స్కూల్స్, హాస్టళ్లలో భోజనం, బియ్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి

అంగన్వాడీల్లో గుడ్లు, స్కూల్స్, హాస్టళ్లలో భోజనం, బియ్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి

అంగన్వాడీల్లో గుడ్లు, స్కూల్స్, హాస్టళ్లలో భోజనం, బియ్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి
 - కలెక్టర్ వీరపాండియన్ 
కర్నూలు
 జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలలో, సంక్షేమ వసతి గృహాల్లో, స్కూళ్లలో మధ్యాహ్నం పిల్లలకు అందిస్తున్న గుడ్లు, భోజనం, బియ్యం నాణ్యత గా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.  
శనివారం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు కలెక్టరేట్ కాన్ఫెరెన్సు హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 26 మంది ప్రజలు ఫోన్ ద్వారా చెప్పిన సమస్యలను సావధానంగా విని పరిష్కారం పై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలను ఇవ్వడంతో పాటు అనుసంధానకర్తగా వ్యవహరించి సంబంధిత జిల్లా అధికారులను అర్జీదారులతో మాట్లాడించి సమస్య -పరిష్కారం తరహాలో కలెక్టర్ చర్యలు చేపట్టారు.  ఆళ్లగడ్డ నుండి వసుంధర అనే మహిళ డయల్ యువర్ కలెక్టర్ లో మాట్లాడుతూ తాను ఇటీవలే కాన్పు అయ్యానని, బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న కోడి గుడ్లు వారానికి ఒకసారి ఇస్తున్నారని అవి మొదటి రోజు బాగుంటాయని, మరుసటి రోజు నుండి చెడిపోయి వాసన వస్తున్నాయని, తినలేక పోతున్నామని అలాగే స్కూల్లో మధ్యాహ్న భోజన బియ్యం కూడా నాణ్యత గా ఉండడం లేదని ఆమె కలెక్టర్ వీరపాండియన్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ వెంటనే ఐసిడిఎస్ పిడి లీలావతితో మాట్లాడించారు. నంద్యాల డివిజన్ లో అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లను సరఫరా చేసే గుత్తేదారుడిని తక్షణమే తన వద్దకు పిలిపించాలని ఐసిడిఎస్ పిడి లీలావతి ని కలెక్టర్ ఆదేశించారు. కాంట్రాక్టర్లు కోడి గుడ్లను ఏమైనా ఉచితంగా ఇస్తున్నారా? ప్రభుత్వం డబ్బును ఇస్తోంది కదా..మరి నిర్దేశిత సైజ్ లో నాణ్యమైన కోడి గుడ్లను ఎందుకు ఇవ్వడం లేదు..మీరు విచారణ చేయండని పిడి ని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జేడీఏ ను పంపి అంగన్వాడీలు, స్కూల్స్, హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేయించి, గుడ్లు, బియ్యం, భోజనం నాణ్యతను పరిశీలింపజేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డయల్ యువర్ కలెక్టర్ లో ఫిర్యాదు చేసిన ఆళ్లగడ్డ వసుంధర కు కలెక్టర్ వివరించారు.
అలాగే, తాను ఇదివరకే మిషన్ కర్నూలు సమీక్షా సమావేశాలలో ఆదేశించిన విధంగా అన్ని అంగన్వాడీ లు, సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ల లో పిల్లలకు అందిస్తున్న కోడి గుడ్లు, మధ్యాహ్న భోజనం, బియ్యం నాణ్యత గా, రుచి, శుచి కరంగా ఉండేలా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. ఒకవేళ బియ్యం బాగాలేకపోతే తనకు గాని లేదా జెసి కి గాని తెలియజెపితే డీఎస్ఓ, సివిల్ సప్లయిస్ అధికారులకు చెప్పి నాణ్యమైన బియ్యాన్ని పంపిస్తామని కలెక్టర్ వీరపాండియన్ స్పష్టం చేశారు.
అలాగే గతంలో నంద్యాల పట్టణం రోడ్డు విస్తరణలో ఇళ్ళు కోల్పోయిన తమకు త్వరగా పరిహారాన్ని ఇప్పించాలని ఇద్దరు డయల్ యువర్ కలెక్టర్ లో తెలుపగా సమస్యను ప్రభుత్వానికి తెలిపామని నిధులు మంజూరు చేసిన వెంటనే పంపిణీ చేస్తామని కలెక్టర్ వీరపాండియన్, జెసి రవి పట్టన్ షెట్టి కు వివరించారు. అలాగే భూ సమస్యలు, శానిటేషన్ తదితర సమస్యల పై డయల్ యువర్ కలెక్టర్ లో మరి కొంతమంది సమస్యలను తెలుపగా వెంటనే చర్యలను తీసుకోవాలని డిఆర్ఓ, ఆర్డీవో లు, డిపిఓ, మునిసిపల్ కమీషనర్ లను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. మరికొందరు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను అడుగగా ప్రస్తుతం వైఎస్సార్ నవశకం ఇంటింటా సర్వే ద్వారా కొత్తగా బియ్యం కార్డు తో పాటు 4 కొత్త కార్డులను, 7 సంక్షేమ పథకాల లబ్దిదారులను వాలంటీర్ల ద్వారా గుర్తింపు చేసే సర్వే జరుగుతోందని, వాలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు అన్ని వివరాలను వెల్లడించాలని కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
అలాగే పాణ్యం సమీపంలో ఉన్న సుగాలి మిట్ట లో నాటు సారా అమ్ముతున్నారని డయల్ యువర్ కలెక్టర్ లో ఫిర్యాదు చేయగా వెంటనే ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బందిని పంపి ముమ్మర తనిఖీలు చేపట్టి నాటు సారా ఉంటే సీజ్ చేసి నాటుసారా తయారీదారులు, అమ్మేవారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేసవరావ్ ను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. అలాగే, జిల్లా అధికారులు అందరూ స్పందన, డయల్ యువర్ కలెక్టర్, ఎస్సి, ఎస్టీ, ఉద్యోగుల ప్రత్యేక స్పందన లో వచ్చిన వినతులను, సమస్యలను వేగవంతంగా, సమస్య పరిష్కారం పై అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ వీరపాండియన్ డయల్ యువర్ కలెక్టర్ లో అధికారులను ఆదేశించారు. జెసి రవి పట్టన్ షెట్టి,  డిఆర్ఓ పుల్లయ్య లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts