YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రలోభాలకు లొంగం అమరావతి

ప్రలోభాలకు లొంగం అమరావతి

ప్రలోభాలకు లొంగం
అమరావతి
సుజనా చౌదరిలాగా దొడ్డి దారిన గోడ దూకి వెళ్లే ఎంపీలు తమ దగ్గర లేరని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై స్పందించిన మంత్రి మోపిదేవి కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ.. ప్రలోభాలకులోనై పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్లే నాయకులు తమ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రమని, వెంకటేశ్వరస్వామి సన్నిధిని ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు కానీ, వాటిపై పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.వర్షాల కారణంగా ఉల్లి ధరలు పెరిగాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.45 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని అందుబాటులో ఉంచామని, రైతు బజార్లలో కిలో ఉల్లిని 25కే విక్రయిస్తామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళారి వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దొడ్డిదారిన గోడదూకి వెళ్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో లేరని, తమకు మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. తమ నాయకులపై నమ్మకం ఉందని మోపిదేవి వెంకటరమణ చెప్పారు

Related Posts