అనకాపల్లిలో మంత్రి కన్నబాబు పర్యటన
విశాఖపట్నం:
విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి కన్నబాబు పర్యటించారు.ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.అధికారంలోకి వచ్చి ప్రభుత్వ అనతికాలంలోనే పలు అభివృద్ది కార్యక్రమాలతో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు.సుపరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు ఇసుక, ఇంగ్లీషు అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.మత మార్పిడి కోసమే ఇంగ్లీషును ప్రొత్పహిస్తున్నామంటే చేసిన వ్యాఖ్యలను మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు.ఇంతవరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఎంతమంది మతమార్పిడులు జరిగాయని ప్రశ్నించారు.ఇంగ్లీష్ చదివిన వాళ్లు మతం మారాల్సి వస్తే ముందుగా లోకేష్ మారాలని హితవు పలికారు.పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య విధానం పై మొదట విమర్శలు చేసిన చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు.