ప్రభుత్వ భూములు పరిశీలన
మద్దికెర
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించడంలో నిమగ్నం అయ్యారు.అర్హత కలిగిన వారికి ఇంటి స్థలాలు కేటాయింపు కొరకు ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా యడవలి గ్రామానికి సమీపంలో సర్వే నంబర్ 398లో గల భూమిని గుర్తించారు.ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపుతామని తాహసిల్దార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ రవి,సర్వేయర్ సుధాకర్,విఆర్వో లు వి.ఆర్.ఏ లుతదితరులు పాల్గొన్నారు.