YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

రమణీయం... శ్రీ సీతారాముల కళ్యాణం.-రథాన్ని లాగేందుకు పోటీ పడ్డ భక్తులు

రమణీయం... శ్రీ సీతారాముల కళ్యాణం.-రథాన్ని లాగేందుకు పోటీ పడ్డ భక్తులు

రమణీయం... శ్రీ సీతారాముల కళ్యాణం.
-రథాన్ని లాగేందుకు పోటీ పడ్డ భక్తులు
-రథోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి.
ఎమ్మిగనూరు:
పట్టణంలోని సోమప్ప నగర్ లో వెలసిన శ్రీ సీతారామంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం శ్రీ సీతారాములవారి కళ్యాణోత్సవముతో పాటు సాయంత్రం రథోత్సవం  కనుల పండువల అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలకు పట్టు వస్త్రాలను దరింపజేసి,పూలతో అలంకరించిన పల్లకిలో తీసుకువచ్చి అలంకరించిన రథంలో ఉంచి భక్తులు రథాన్ని లాగారు. సోమప్ప నగర్ లోని ప్రజలతో పాటు పట్టణము మరియు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు వేలల్లో తరలివచ్చారు.శ్రీ సీతారామంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవ విగ్రహాల ఉరేగింపుకు రథం లేకపోవడంతో స్థానిక వై.సి.పి నాయకులు పాల శ్రీనివాసరెడ్డి, హేమలత రెడ్డి దంపతులు లక్షలరుపాయలు ఖర్చు పెట్టి రథాన్ని ఏర్పాటు చేయించారు.గత మూడు రోజుల నుండి దేవాలయంలో పూజలు,హోమాలు భక్తుల సమక్షంలో ప్రారంభమైయ్యాయి.శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా శనివారం తెల్లవారుజామున దీక్ష హోమం, శ్రీ ఆంజనేయ స్వామి మూలమంత్ర హోమం,రథంగా హోమం, రథ సంస్కారం, మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి, కలశ, ఉద్వాసన సంప్రోక్షణ అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణమును పాల శ్రీనివాసరెడ్డి, శ్రీమతి హేమలత రెడ్డి దంపతులు మరియు విశ్వనాథం రమేష్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మధ్యాహ్నం దేవాలయ నిర్వాహకులు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయంలో అశేష భక్త జనసంద్రము మధ్య శ్రీ సీతారాముల వారి రథోత్సవం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం సెక్రెటరీ ఎం నారాయణ, కోశాధికారి బి. ఈరన్న, సభ్యులు రఘు, నరసింహులు, పట్టా నాగరాజు, దేవేంద్ర, ఆనంద్, విశ్వనాథన్ శ్రీరాములు, విశ్వనాథన్ కృష్ణ, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts