YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి

రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి

రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి
కర్నూలు, 
బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర అధికంగా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సి-క్యాంపు రైతు బజారులో సబ్సిడీ ఒక కేజి ఉల్లి రూ.25/-లకే విక్రయిస్తున్నామని జాయింట్ కలెక్టర్  రవి పట్టన్ షెట్టి తెలిపారు.శనివారం సి-క్యాంపు రైతు బజారులో పాణ్యం ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలసి సబ్సిడీ ధరపై ఉల్లి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ బహిరంగ  మార్కెట్లో ఉల్లి అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మార్కిటింగ్ శాఖ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి కిలో 25 రూపాయలకే వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. బహిరంగ మార్కెట్లొ ఒక కిలో ఉల్లి రూ.70 నుండి 100 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ ధరపై రూ.25 కే ఉల్లిని వినియోగదారులకు విక్రయిస్తూ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మార్కెట్లో సాదారణ పరిస్థితి వచ్చేంత వరకు సబ్సిడి ధరపై ఉల్లిని విక్రయిస్తామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆదోని, నంద్యాల రైతుబజార్లలోకూడా సబ్సిడీ పై ఉల్లి విక్రయకేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ సామన్య ప్రజలకు ఉల్లి ధర అందుబాటులోఉండే విధంగా సబ్సిడీపై ఒక కేజి ఉల్లి ధర 25 రూపాయలకే విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రైతు బజారులోకూరగాయల విక్రయదారులు, వినియోగదారుల తో ఇరుకుగా ఉందని విస్తరింప జేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టరును కోరారు. కల్లూరు లోని ముజఫర్ నగర్ లో రైతుబజారు ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కూడ పూర్తి అయిందని నిర్మాణ పనులు వేగవంతం చేసి రైతు బజారును ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతకు ముందు పాణ్యం ఎమ్మెల్యేరైతు బజారులో విస్త్రతంగా తిరిగి విక్రయదారులు, రైతులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts