YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నవశకం తో గ్రామ స్వరాజ్యం - మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ.

నవశకం తో గ్రామ స్వరాజ్యం - మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ.

నవశకం తో గ్రామ స్వరాజ్యం - మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ.
అనంతపురం :
రొద్దం మండలం మరువ పల్లి గ్రామ సచివాలయానికి రాష్ట్ర బి సి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం నాడు భూమి పూజ,  శంకుస్థాపన చేసి ప్రారంభించారు. తరువాత శ్రీ శక్తి భవన్లో నవశకం కార్యక్రమంలో భాగంగా గ్రామ వాలెంటీర్లకు అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసిందని గ్రామసచివాలయాలు కీలకమైన పాత్ర పోషించనున్నాయని ఆయన తెలిపారు. లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు మరియు నాలుగు లక్షల వాలెంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. సచివాలయాల్లో 12 విభాగాలకు సంబంధించిన అధికారులు ఉంటారని, ప్రాంత పరిధిలోని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా మండల కేంద్రానికి రాకుండా సచివాలయాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పింఛను కార్డులు, రైస్ కార్డులు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు, వైఎస్సార్ విద్యాదివెన కార్డులు, వసతి వంటివి సచివాలయాల ద్వారా 72 గంటల్లో ఇచ్చే ఏర్పాట్లు చేస్తునన్నాం అని చెప్పారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న నవశకం తో ఇంటింటా నవోదయం రావాలని, గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం ప్రజల వద్దకే పాలన సచివాలయాల ద్వారా అందిస్తాం అని ఆయన చెప్పారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులను గుర్తించి సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలని జగనన్న మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. జగన్నన లక్ష్యాలను మీ ద్వారా సాథించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికే ఈ గురుతర భాధ్యతను మీకు ఇచ్చారన్నారు. బంధుప్రీతి అవినీతి అక్రమాలకు తావు ఇవ్వరాదని ఎవరైనా పొరపాట్లకు తావు ఇస్తే వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నిబద్ధతతో నిజాయితీతో పని చేయాలని సూచించారు. ఒక వాట్సాప్ గ్రూపును చేసి వాలంటిర్లకు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమానంతరం రొధం వైసీపీ కన్వీనర్ నారాయణరెడ్డి ఇంట్లో మంత్రి గారిని ఘనంగా సన్మానించారు. రధం పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో, డి ఎస్పీ మెహబూబ్ భాష, రొద్దం మండలం వైసీపీ కన్వీనర్  బి. నారాయణరెడ్డి, అక్కులప్ప, సి. నారాయణ రెడ్డి, ఎన్. నారాయణ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్ర, తదితర పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Posts