YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అమ్మ పాత్రలో ఒదిగిపోయిన కంగనా

అమ్మ పాత్రలో ఒదిగిపోయిన కంగనా

అమ్మ పాత్రలో ఒదిగిపోయిన కంగనా
చెన్నై, నవంబర్ 23,
తమిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి, సినీ నటి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్రను ఆధారంగా రూపొందుతోన్న బయోగ్రాఫికల్‌ మూవీ `త‌లైవి`. ఈ సినిమాలో జయ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభ‌మైంది.ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్(ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు.తాజాగా ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. జ‌య‌ల‌లిత ఓల్డ్ గెట‌ప్‌లో కంగ‌నా ర‌నౌత్ ఒదిగిపోయారు. అలాగే టీజ‌ర్‌లో జ‌య‌లలిత‌కు సంబంధించిన రెండు గెట‌ప్‌ల‌ను విడుద‌ల చేశారు.అందులో ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ లుక్ ఒక‌టి కాగా.. త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పాత్రకు సంబంధించిన లుక్ మ‌రొక‌టి. ఏఎల్‌ విజ‌య్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.

Related Posts