YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

డాక్టర్ రాసలీలలు

డాక్టర్ రాసలీలలు

డాక్టర్ రాసలీలలు
హైద్రాబాద్, నవంబర్ 23, 
డాక్టర్ ముసుగులో మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కీచకుడి గుట్టురట్టు చేశాడో ఎన్‌ఆర్‌ఐ. గుట్టు చప్పుడు కాకుండా డాక్టర్‌తో తన భార్య పెట్టుకున్న సంబంధాన్ని బయటపెట్టాడు. పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించాడు.. డాక్టర్ గారి భాగోతం తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ బోడుప్పల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.హైదరాబాద్ చైతన్యపురికి చెందిన శివప్రసాద్ బోడుప్పల్ ఆర్బీఎం ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో శివప్రసాద్ అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త ఆస్ట్రేలియాలో ఉండటంతో.. కొద్దిరోజులుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. శివప్రసాద్‌తో ఎఫైర్ పెట్టుకున్న లేడీ డాక్టర్ భర్తకు కొద్దిరోజులు క్రితం అనుమానం వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న అతడు.. భార్య గురించి ఆరా తీశాడు.డాక్టర్ శివప్రసాద్‌తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తేలడంతో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చాడు. భార్య శివప్రసాద్ ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నేరుగా పోలీసులతో కలిసి.. ఆ ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చివర్లో పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురయ్యింది. అదే ఇంట్లో మరో జంట ఇంకో బెడ్‌రూమ్‌లో కనిపంచింది.. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు డాక్టర్ శివప్రసాద్ అనుచరులు కొందరు కొద్దిసేపు హడావిడి చేశారు.. మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు.

Related Posts