YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

న్యాయపోరాటానికి సిద్ధమౌతున్న కాంగ్రెస్, శివసేన

న్యాయపోరాటానికి సిద్ధమౌతున్న కాంగ్రెస్, శివసేన

న్యాయపోరాటానికి సిద్ధమౌతున్న కాంగ్రెస్, శివసేన
ముంబై, నవంబర్ 23,
మహారాష్ట్రలో పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ శనివారం స్పందించారు. బీజేపీ చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఆయన ఈ విషయంలో రాజకీయ, న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అహ్మద్ పటేల్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల వెలువడిన మర్నాడు నుంచి గవర్నర్ వ్యవహారశైలి సక్రమంగా లేదని మండిపడ్డారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని తర్వాత శివసేన, ఎన్‌సీపీలను ఆహ్వానించారు కానీ, కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వలేదని అన్నారు. అలాగే, మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే జాబితాను పరిశీలించకుండానే హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించడం చూస్తుంటే వ్యవహారం తప్పుదారిపట్టిందని అనుమానం కలుగుతుందని అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు.కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారంపై కనీసం మీడియాకు సమాచారం ఇవ్వకుండా పొద్దున్నే కార్యక్రమం నిర్వహించి ప్రజాస్వామ్య పద్దతులు, రాజ్యాంగ చట్టాలను పూర్తిగా అతిక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్‌సీపీ- కాంగ్రెస్ ఓవైపు ప్రయత్నాలు చేస్తుంటే దీనికి ముందే రహస్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుపై తమ మూడు పార్టీలూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చాయని, కొన్ని అంశాలపై శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవాలని భావించాం... కానీ, దీనికి ముందే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయిందని అహ్మద్ పటేల్ అన్నారు.మరోవైపు, తాజా పరిణామాలపై శివసేన, ఎన్‌సీపీలు శనివారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. తమ కూటమికి 170 మంది మద్దతు ఉందని, కొంత మంది స్వతంత్రులు కూడా ఉన్నారని తెలిపాయి. బీజేపీకి మద్దతు అనేది అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయమని.. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని శరద్ పవార్ పేర్కొన్నారు. అలాగే, అజిత్‌ను బ్లాక్‌మెయిల్ చేసి బీజేపీ తనవైపు తిప్పుకుందని శివసేన నేత సంజయ్ రౌత్ దుయ్యబట్టారు.

Related Posts