కార్యాచరణకు సిద్ధమౌతున్న ఆర్జీసీ జేఏసీ
హైద్రాబాద్, నవంబర్ 23,
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సమ్మెకు సంబంధించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సమ్మె కొనసాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమీక్షలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను అన్నారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని చెప్పారు. ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవహారాలుగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని డిపోల నుంచి మహిళా ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఎవరు బయపడొద్దని.. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదన్నారు.. ప్రైవేటీకరణ చట్టంలో లేదని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే తెలంగాణవ్యాప్తంగా కార్మికుల నిరసనలకు 50 రోజుకు చేరింది. అన్ని జిల్లాల్లో కార్మికులు డిపోల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో ఆందోళనలు చేశారు. ఖమ్మంలో డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి