YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 పేదింటి ఆడ బిడ్డలకు పెద్దన్నలా కేసీఆర్  -నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

 పేదింటి ఆడ బిడ్డలకు పెద్దన్నలా కేసీఆర్  -నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

 పేదింటి ఆడ బిడ్డలకు పెద్దన్నలా కేసీఆర్ 
-నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 
వరంగల్ రూరల్ :
పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొనియాడారు. శనివారం క్యాంపు కార్యాలయంలో 678 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల 78 లక్షల పైచిలుకు చెక్కులను మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ దేశంలోనే ఈ పథకం ఎంతో ప్రాచుర్యం పొందిందని, పూర్తిగా సామాజిక స్పృహతో తీసుకువచ్చిన గొప్ప పథకమన్న ఆయన ఆడపిల్లలకు పెద్దన్నలా, ప్రతీ పేదింటికి పెద్ద కొడుకులా కేసీఆర్ ఈ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయడం ప్రజల అదృష్టమని వెల్లడించారు. బీసీలకు-487, ఎస్సిలకు-191 చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ప్రతివారం మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా చెక్కులు పెండింగ్ లో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ములుగు, రామచంద్రపురంలోని పత్తి రైతు ఇల్లు కాలి పోయి బిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బులు బుగ్గిపాలై పెళ్ళి కోసం యాతన పడుతున్న సమయంలో కెసిఆర్ మదిలో పుట్టిన ఆలోచనకు అంకురార్పనే కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ల రూపంలో పేదింటి ఆడపిల్లలందరికీ ఆర్థిక సహాయం అందించాలని ఆనాడే సంకల్పించారని ఎమ్మెల్యే వివరించారు. ఎవరూ ఈ పథకాలు కావాలని అడగకున్నా ప్రజకు ఏం కావాలో తెలిసిన కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలకు ఆద్యుడయ్యారన్నారు. చెక్కుల పంపిణీలో సహకరించిన రెవెన్యూ అధికారులకు ధన్యవాదాలు తెలిన పెద్ది సుదర్శన్ రెడ్డి 
చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 
వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ మానస పుత్రిక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమని తెలిపారు. చెక్కుల ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం ఎమ్మెల్యే పెద్ది ఎంతో శ్రమిస్తున్నారని, దేశంలోనే ఈ పథకం నంబర్ వన్ ప్లేస్ లో ఉందని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మేడారం జాతర పర్యావరణ కాలుశ్యం కాకుండా ప్లాస్టికేతర సంచులు, వస్తువులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. 
రూరల్ జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, చెక్కుల పంపకంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు మేనమామగా, పెద్దన్నగా బాధ్యత తీసుకొని ప్రవేశపెట్టిన గొప్ప పథకం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని, ఆడపిల్లల పెళ్లిళ్ళు భారం కాకూడదని సదుద్దేశంతో ప్రవేశపెట్టిన మంచి పథకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆరు మండలాల ఎమ్మార్వోలు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts