YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతు సంక్షేమమే టీఆరెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే టీఆరెస్ ప్రభుత్వ ధ్యేయం

 రైతు సంక్షేమమే టీఆరెస్ ప్రభుత్వ ధ్యేయం
-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ అర్బన్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నందనం రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గానీ,  ఏ ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా రైతులకు, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండగ చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. కనీసం మూడు గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయని గత పాలకుల పాలనతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాకుండా రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. రైతుకు పంటకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్ధిక భరోసా కల్పించి కేసీఆర్ రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారని కొనియాడారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, లక్ష రూపాయల రుణమాఫీ, రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేలా 5 లక్షల రూపాయలు రైతు భీమా ధ్వారా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ,దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటుందని ఆరూరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, ఆర్ఎస్సెస్ మండల కో ఆర్డినేటర్ జయపాల్, మండల కోప్షన్ గుంశావలి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts