విధులకు వస్తాం..
జగిత్యాల
జగిత్యాల డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు పోలీసు బంధోబస్తుకు పోలీసులను మోహరించారు. అయితే కార్మికులు నిరసన తెలుపుతూ తమను విధుల్లోకి తీసుకోవాలని, ఇప్పుడు పని చేస్తున్న కార్మికుల కు ఇచ్చే జీతం ఇచ్చినా సరే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ,తమ కుటుంబాల పరిస్తితులు చాలా దారుణం గా ఉన్నాయని డిపో మేనేజర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీ ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విధుల్లోకి చేరేందుకు మేము సిద్ధం అంటూ,తమను షరతులు లేకుండా డ్యూటీలో కి అనుమతించాలని డిఎం జగదీశ్ ను కోరారు.