YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేయూత -నాకోసం కాదు-మీకోసం నినాదంతో సేవా కార్యక్రమాలు

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేయూత -నాకోసం కాదు-మీకోసం నినాదంతో సేవా కార్యక్రమాలు

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేయూత
-నాకోసం కాదు-మీకోసం నినాదంతో సేవా కార్యక్రమాలు 
తోటి స్నేహితురాలికి అండగా మేముసైతం అంటూ భరోసా 
వరంగల్ అర్బన్:
 కాకతీయ విశ్వ విద్యాలయంలోని జాతీయ సేవా పథకం(ఎన్ ఎస్ ఎస్)వాలంటీర్లు సమాజ సేవకై ముందుకొచ్చి నిస్సహాయకురాలిగా ఉన్న ఓ పేద విద్యార్థినికి చేయూతనందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కుంటపెల్లి గ్రామానికి చెందిన నజియా అనే డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పక్షవాతంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిరుపేదరాలైన నజియాను చేరదీసి గత వారం రోజులుగా మెరుగైన వైద్య సేవలు చేయిస్తున్న"సహృదయ స్వచ్ఛంద సంస్థ" నిర్వాహకులు యాకూబీ, చోటులు నజియాకు మరింత మెరుగైన వైద్యం అందించాలని చేస్తున్న ప్రయత్నాలను మీడియా మాధ్యమాలలో చూసి 
చలించిన అదే కాకతీయ ప్రభుత్వ డిగ్రీ  కళాశాలలో చదివే ద్వితీయ, తృతీయ సంవత్సరం ఎన్ఎస్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు తోటి విద్యార్థిని నజియా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆమెకు సాయం చేయాలని సంకల్పించారు. నజియా కుటుంబ ఆర్ధిక స్థితిగతులను తెలుసుకొని జాతీయ సేవ పథకం ద్వారా నేర్చుకున్న "నా కోసం కాదు- మీ కోసం" అన్న నినాధంతో సేవే సంకల్పంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు ఎం.జి.ఎం.హాస్పిటల్ వెళ్లి నజియాను పరామర్శించారు.  "సహృదయ స్వచ్ఛంద సంస్థ"నిర్వాహకులు యాకూబీ, చోటుల ఆధ్వర్యంలో నజియా తల్లికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి స్నేహానికి పరమార్థాన్ని చూపారు. తోటి స్నేహితురాలికి అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ సీనియర్ వాలంటీర్ అనీస్ పర్వేజ్, సాయితేజ, వినయ్, సందీప్, అఖిల, రమ్య,
తులసి, శివ కృష్ణ, స్వామి తదితరులుపాల్గొన్నారు.

Related Posts