1980 హీరోలు.. హీరోయిన్ల సందడి
హైదరాబాద్: ఒకప్పుడు తమ సినిమాలతో అలరించిన ఎనభైల నాటి తారలంతా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఏటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా రకరకాల ప్రదేశాల్లో ఈ వేడకలను నిర్వహించారు. పదో వార్షికోత్సవం సందర్భంగా ఆ వేదికను ఈ సారి చిరంజీవి నివాసానికి మార్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో ఈ సారి రీయూనియన్ మీట్‌ను నిర్వహించారు. శని, ఆదివారం జరిగిన ఈ వేడుకతో ఆయన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలో 1980-90లో అగ్రతారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా మలయాళం, కన్నడ నుంచి మొత్తం 40 మంది తారలు పాల్గొన్నారు. వీరిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మోహన్‌లాల్, భాను చందర్, జగపతి బాబు, నరేష్, సురేష్, సుమన్, జయసుధ, జయప్రద, రాధిక, నదియా, అమల, శోభన, సుహాసి, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, రెహమాన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు నటులు హైదరాబాద్ చేరుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి