YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాంచి.... దూకుడు మీద అఖిల

మాంచి.... దూకుడు మీద అఖిల

మాంచి.... దూకుడు మీద అఖిల
కర్నూలు, 
రాజ‌కీయ కుటుంబం నుంచి వార‌సురాలిగా పాలిటిక్స్‌లో అరంగేట్రం చేసిన భూమా అఖిల ప్రియ‌కు నిజా నికి ఇప్పుడున్న అనుభ‌వం పెద్దగా లెక్కలోకి తీసుకోద‌గ్గది కాదు. త‌ల్లి మ‌ర‌ణంతో ఆళ్లగ‌డ్డ నుంచి 2014 ఉప ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించిన ఆమె.. తండ్రి నాగిరెడ్డి మ‌ర‌ణంతో టీడీపీలో మంత్రి ప‌దవిని ద‌క్కించుకుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అఖిల ప్రియ రాజ‌కీయ అనుభ‌వం కేవ‌లం 5 సంవ‌త్సరాలే. అయితే, అనూహ్యంగా భూమా అఖిల ప్రియ‌ రాజ‌కీయాల్లో పుంజుకున్నారు. త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. నిజానికి అధికారంలో ఉండ‌గానే.. భూమా అఖిల ప్రియ‌ దూకుడు ప్రద‌ర్శించారస్థానికంగా త‌న‌కు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి వంటి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుల‌ను కూడా ఎదుర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో ప‌ట్టుబ‌ట్టి త‌న పెద్దనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఇల్లిల్లూ తిరిగి, గ‌ట్టి పోటీని ఎదుర్కొనిమ‌రీ ఆయ‌న‌ను గెలిపించుకుని అఖిల ప్రియ టీడీపీలో త‌న స‌త్తాచాటారు. ఆ ఎన్నిక‌తో భూమా అఖిల ప్రియ‌ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైలెట్ అయ్యింది.ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె జ‌గ‌న్ సునామీ ముందు భూమా అఖిల ప్రియ‌ ఓట‌మి పాల‌య్యారు. ఆళ్లగ‌డ్డలో మంత్రి హోదాలో భూమా అఖిల ప్రియ‌, అటు నంద్యాల‌లో ఆమె సోద‌రుడు బ్రహ్మానంద‌రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక‌, స‌హజంగా ఓడిపోయిన నాయ‌కుల‌పై అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఒత్తిళ్లు వ‌చ్చాయి. వ‌స్తున్నాయి. పోలీసు కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఒత్తిళ్లుత‌ట్టుకోలేక చాలా మంది టీడీపీ నాయ‌కులు సైలెంట్ అయిపోయారు. కొంద‌రుపార్టీ మారిపోయారు. ఇంకొంద‌రిలో గెలిచిన వారు కూడా పార్టీకి రాజీనామా చేశారు.కానీ, భూమా అఖిల ప్రియ‌ మాత్రం త‌న‌పైనా.. త‌న భ‌ర్త‌ పైనా కేసులు న‌మోదైనా.. దైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ తాను టీడీపీని వీడేది లేద‌ని చెప్పడ‌మే కాకుండా చేసి చూపిస్తున్నారు. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కుల తీరును ఎప్పటిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి చీల్చి చెండాడేస్తున్నారు. ఇటీవ‌ల కేసులు త‌ట్టుకోలేకే తాను పార్టీ మారుతున్నాన‌ని గ‌న్నఃవ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్రక‌టించి టీడీపీకి రాజీనామా చేశారు. కానీ, అఖిల ప్రియ మాత్రం ఇలాంటి ప‌నులు చేయ‌క‌పోగా.. మ‌రింత గ‌ట్టిగా త‌న గ‌ళం వినిపిస్తున్నారు. జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. నిత్యం మీడియాలో ఉంటున్నారు.యురేనియం త‌వ్వకాల స‌మ‌యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో భూమా అఖిల ప్రియ‌ ఒంట‌రిగానే ఎదుర్కొన్నారు. ఈ స‌ర్వేను ఆపేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దీంతో ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.మ‌హిళే అయిన‌ప్పటికీ.. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడుతున్న వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యద‌ర్శి లోకేష్‌లు కూడా మెచ్చుకున్నారు. ఆమెకు స‌పోర్టుగా ఉండాల‌ని జిల్లా పార్టీని ఆదేశించారు. టీడీపీ నేత‌లు అయితే ప‌లు ప్రాంతాల నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా భూమా అఖిల ప్రియ‌కు, వంశీకి లింక్ పెట్టి కేసుల భ‌యం అయితే వంశీ నువ్వు ఒక జేబులో అఖిల‌ప్రియ ఫొటో, మ‌రో జేబులో చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఫొటో పెట్టుకుని పోరాడాల‌ని… ఓ యువతి.. చిన్న వ‌య‌స్సులో కూడా ఎలా ? పోరాటం చేస్తుందో ? చూసి నేర్చుకోవాల‌ని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ కేడ‌ర్‌లో ఆమె ధైర్యం, తెగువ‌ను ప్రశంసిస్తున్నారు. మొత్తానికి పార్టీలో గెలిచిన, ఓడిన మేధావుల ముందు.. పెద్దగా అనుభ‌వం లేక‌పోయినా.. దూకుడు ప్రద‌ర్శిస్తున్న భూమా అఖిల ప్రియ‌కే మంచి మార్కులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts