YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఉసిరిక వనంలో  వ్రతాలు, దీపారాధనతో మహిళలు సందడి

ఉసిరిక వనంలో  వ్రతాలు, దీపారాధనతో మహిళలు సందడి

ఉసిరిక వనంలో  వ్రతాలు, దీపారాధనతో మహిళలు సందడి
భూపాలపల్లి నవంబర్ 25  
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి ప్రాంతంలో గల ఉసిరిక వనంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి పలువురు దంపతులు కార్తీకమాసం వైకుంఠ త్రయోదశి పురస్కరించుకుని వ్రతాలు దీపారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వేదపండితులు నాగరాజు శర్మ సుమారు 15 జంటలచే సత్యనారాయణ వ్రతాలు నిర్వహింపజేశారు,వ్రతాల అనంతరం వనంలో ఉన్న ఉసిరికచెట్ల కింద ఉసిరికకాయలతో చేసిన దీపాలనుముట్టించి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు,వేదపండితులకు వ్రతాలు చేసుకున్న జంటలు దీపాలతో పాటు ఇతర వస్తువులను,కూరగాయలను దానంగా ఇచ్చారు,అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి సామూహిక కార్తీక వనబోజనాలు చేశారు ఈకార్యక్రమంలో గంగిరెడ్డి లచ్చిరెడ్డి,బొమ్మన రవీందర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్, రమేష్,రాంరెడ్డి,శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.

Related Posts