YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సిటీలో పొంచి ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ల ముప్పు

సిటీలో పొంచి ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ల ముప్పు

సిటీలో పొంచి ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ల ముప్పు
మెదక్, నవంబర్ 25,
భాగ్యనగరానికి నైట్రోజన్ ఆక్సైడ్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వాయు కాలుష్యం తీవ్రత పెంచే ఈ ఉద్గారాల శాతం ప్రమాదకర మార్కుకు చేరువైనట్లు పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాయు కాలుష్యంలో రెడ్ మార్క్ ప్రకటించిన ఢిల్లీ కంటే సిటీలో నైట్రోజన్ ఆక్సైడ్ల శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం గాలిలో వెలువడే 40 రకాల కాలుష్య ఉద్గారాల్లో అధిక శాతం నైట్రోజన్ ఆక్సైడ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ఈ ఏడాది ఆగస్టు వరకు లెక్కించిన గణాంకాల ప్రకారం ఢిల్లీలో నైట్రోజన్ ఆక్సైడ్ల శాతం 68.74 శాతం ఉండగా, గ్రేటర్లో 71.51శాతం ఉందని సీపీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఇది వందకు మించితే అత్యంత ప్రమాదమని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొడిదగ్గు, చిరాకు, వంటి సమస్యలు వచ్చి లంగ్స్ మీద ప్రభావం పడుతుందని డాక్టర్లు పేర్కొంటున్నరు.నగరంపై నైట్రోజన్ ఆక్సైడ్లు విరుచుకుపడుతున్నాయి.  వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి విపరీతంగా విడుదలవుతున్న గాఢత కల్గిన రసాయనిక ఉద్గారాల శాతం  అధికమవడంతో ఈ పరిస్థితి నెలకొందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. 2017లో రోజూ సుమారు 50 టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్లు గాలిలో కలువగా,  2018లో 69.51, ఈ  ఏడాది ఆగస్టు వరకు సగటున 71.51టన్నులు గాలిలో కలుస్తున్నట్లు  అధికారులు  గుర్తించారు. సీపీసీబీ నిర్ధేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్లు తీవ్రత 45 శాతానికి మించకూడదు.  కానీ ఈ పరిస్థితి మూడేళ్ల క్రిందటనే దాటిపోవడం జనాల్లో భయాందోళన కలిగిస్తోంది.గ్రేటర్లో సుమారు 70 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో దాదాపు 90 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఉండగా, ఇందులో కాలం చెల్లినవి సుమారు 15 లక్షల దాకా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల్లో ఇంధనం వంద శాతం మండదు. ఈ క్రమంలో మిగిలిపోయిన ఇంధనం  కార్భన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల రూపంలో గాలిలో కలుస్తోంది. పెరుగుతున్న నైట్రోజన్ ఆక్సైడ్ల తో పర్యావరణం దెబ్బతిని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం నైట్రోజన్ ఆక్సైడ్లు వంద శాతానికి పెరిగితే పొగమంచుతో కలిసి ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మొక్కల ఎదుగుదల ఆగిపోతుందని,  మనుషుల్లో ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేగాక రోగ నిరోధక శక్తి తగ్గి పొడి దగ్గు, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయంటున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, సీఎన్జీ గ్యాస్ వాహనాల వాడకం పెరిగితే భవిష్యత్లో ఇటువంటి ముప్పు నుంచి కాస్తైనా తప్పించుకోవచ్చన్న అభిప్రాయాలు

Related Posts