YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో  పెరగనున్న అసెంబ్లీ సీట్లు

తెలుగు రాష్ట్రాల్లో  పెరగనున్న అసెంబ్లీ సీట్లు

తెలుగు రాష్ట్రాల్లో  పెరగనున్న అసెంబ్లీ సీట్లు
న్యూఢిల్లీ, నవంబర్ 25
టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుబట్టి మరీ అడిగారు. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో జరిపిన చర్చల్లో ఇదే ప్రధాన మైన అంశం. అదే అసెంబ్లీ సీట్లు పెంపుదల. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు జరగాల్సి ఉంది. విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లు పెంచాలని ఉంది. వాస్తవానికి దేశంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ సీట్ల పునర్విభజన చేయాలి. ఇది 2024కు జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎప్పుడైనా పెంచుకునే వెసులుబాటును పునర్విభజన చట్టంలో కల్పించారు.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల నుంచి 225 స్థానాలకు, తెలంగాణలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే గత ఐదేళ్లలో పెంచే అవకాశమున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని సీట్ల సంఖ్య పెంపుదలతో లబ్ది పొందాలనుకుంటున్నారని బీజేపీ భావించింది. అందుకే గత ఐదేళ్లలో సీట్ల సంఖ్య పెంచలేదు.అయితే ఇప్పుడు తెలంగాణాలో బీజేపీ కొంత బలపడుతోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పడిపోయిన గ్రాఫ్ ను పార్లమెంటు ఎన్నికల్లో పెంచుకోగలిగింది. ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మె తెలంగాణ సర్కార్ ను కుదిపేస్తుంది. ప్రజల్లోకూడా కొంత టీఆర్ఎస్ పై వ్యతిరేకత కన్పిస్తుంది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.అలాగే ఆంధ్రప్రదేశ్ లో అప్పటి తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో లేదు. పైగా ఏపీలో తాము బలపడాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్లేందుకు కమలనాధులు ఏపీలో సిద్ధమయ్యారు. ఇక్కడ కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచితే పార్టీకి లాభమేనని బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండటం వల్లనే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపుదలకు ఓకే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Related Posts